ఆంధ్రప్రదేశ్

‘మున్సిపల్’లో కూటమిదే హవా

ఆంధ్రప్రదేశ్‌లో నగరపాలక, పురపాలక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించారు. మొత్తం 100 మేయర్‌, చైర్మన్‌ స్థానాల్లో టీడీపీ 68, జనసేన 20, బీజేపీ 4 స్థానాలను గెలుచుకున్నాయి.

Phaneendra

ప్రభాత ఉదయం, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నగరపాలక, పురపాలక సంస్థల ఎన్నికల్లో కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) అభ్యర్థులు భారీ విజయం సాధించారు. మేయర్, చైర్మన్‌ పదవుల్లో మొత్తం 100 స్థానాల్లో టీడీపీ 68 స్థానాలు గెలుచుకోగా, జనసేన 20, బీజేపీ 4, వైఎస్​ఆర్​సీపీ 4, స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు. చాలా చోట్ల కౌంటింగ్‌ ఆలస్యం కావడంతో బుధవారం అర్ధరాత్రి వరకు ఫలితాలను ఒక్కొక్కటిగా ప్రకటించారు. 13 మేయర్‌, 87 మున్సిపల్​ చైర్మన్‌ స్థానాలకుగాను 17 చోట్ల ఏకగ్రీవం కాగా.. 13 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. మున్సిపల్‌ కార్పొరేషన్లలో టీడీపీ 10, జనసేన 2, వైఎస్​ఆర్​సీపీ ఒక స్థానం దక్కించుకుంది. మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో టీడీపీ 59, జనసేన 18, వైఎస్​ఆర్​సీపీ 3, బీజేపీ 4, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలుపొందారు. వైఎస్​ఆర్​సీపీ నుంచి రమేశ్​గౌడ్‌(అనంతపురం), రాజేశ్వరమ్మ (నాయుడుపేట), షేక్‌ ఫాతిమాబీ(నందికొట్కూరు) గెలుపొందారు. మురసు తుఫాను కారణంగా బాపట్ల జిల్లా చీరాల చైర్మన్‌ స్థానం లెక్కింపును 6వ తేదీకి అధికారులు వాయిదా వేశారు.