ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ

 ‘స్థానిక’ ఎన్నికలపై వ్యూహరచన

Aravind Reddy

విజయవాడ: అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. తొలుత చంద్రబాబుతో కలిసి పవన్ అల్పాహార విందు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలను సిద్ధం చేయడం, సీట్ల సర్దుబాటుపై వారిద్దరు చర్చించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోని ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి? కీలకమైన కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలి? అనే అంశాలతో పాటు ఎన్నికల వ్యూహాలపై చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగింది. ఎన్నికల షెడ్యూల్ రాగానే అధికార కూటమిలోని పార్టీలన్నీ సమన్వయంతో ముందుకుసాగేలా కార్యాచరణను సిద్ధం చేసుకోవడంపైనా ఈసందర్భంగా ప్రస్తావన వచ్చింది.