అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉందని ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో ఉండగానే వైసీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గురువారం లోకేశ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టుల నియామకాలు చేపడతామన్నారు. కార్పొరేషన్ చైర్మన్లను కొనసాగించాలా? లేదంటే కొత్తవారిని నియమించాలా? అన్నది వారి పనితీరు ఆధారంగా నిర్ణయిస్తామన్నారు.