పెద్దవాగు వరదలో చిక్కుకున్న 22 మంది కూలీలను రక్షిస్తున్న సహాయక బృందాలు. 
ఆంధ్రప్రదేశ్

పెద్దవాగులో చిక్కుకున్న 22 మంది క్షేమం కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీస్‌ సిబ్బంది

పామాయిల్‌ తోటల్లో పనులు ముగించుకుని వస్తుండగా పెద్దవాగు వరదలో చిక్కుకున్న 22 మంది కూలీలను అధికారులు రక్షించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, అమరావతి : పెద్దవాగులో చిక్కుకున్న 22 మంది కూలీలను ఎన్‌డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది రక్షించారు. ఏపీలోని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరం, కనకపురం గ్రామాలకు చెందిన 22 మంది కూలీలు పామాయిల్‌ తోటలలో పనులు ముగించుకుని బుధవారం రాత్రి జీలుగుమిల్లి రౌతుగూడెం వంతెన దగ్గరికి వచ్చేసరికి పెద్దవాగు వరద పోటెత్తింది. దీంతో వారంతా వాగులోనే చిక్కుకుపోయారు. ఫోన్‌ ద్వారా పరిస్థితిని ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే సిబ్బందికి ఆదేశాలిచ్చారు. పోలీసులు, రెవెన్యూ, ఎన్‌డీఆర్‌‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో కూలీలను బయటకు తీసుకువచ్చారు. వారిని బుట్టాయిగూడెం లోని తుఫాన్‌ పునరావాస కేంద్రానికి తరలించి ఆహరం అందించారు.