ప్రభాత ఉదయం, అమరావతి: తిరుపతిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఐఐఎస్ఈఆర్)లో వచ్చేనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు డీజీపీ, ఐజీపీల జాతీయస్థాయి సమావేశం నిర్వహించ నున్నారు. దానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరుకానున్నారు.
చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి సోమవారం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం కోసం మోదీ, అమిత్‌షాతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు, ఐజీపీలతో సహా 200 మందికిపైగా ఐపీఎస్ అధికారులు, మరో 200 మంది ఐబీ అధికారులు, ఎన్ఎస్ఏ, హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు హోజరుకానున్నట్టు చెప్పారు.
ఈ సమావేశానికి వర్చువల్‌గా హాజరైన డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు ఒకసారి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలని సీఎస్‌కు సూచించారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ మధుసూదన్‌రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.