వాషింగ్టన్: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాలో పండుగల సీజన్ కోసం భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకుంటోంది. భారీగా ఆర్డర్లు వస్తాయనే అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గడచిన 3 ఏళ్లలో తొలిసారిగా రిక్రూట్మెంట్ సంఖ్యను గణనీయంగా పెంచారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాలలో నియామకాలు జరగనున్నాయి.
పండుగల వేళ భారీ రద్దీ
భారత్‌లో పండుగ సీజన్ అమ్మకాలు విపరీతంగా పెరుగుతుండటంతో నియామకాలపై దృష్టిపెట్టారు. ఈసారి విక్రయాల వృద్ధి 4.2 శాతం మేర ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు సేవలు అందించేందుకు 3 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్, సీజనల్ పద్ధతిలో ఈ అవకాశాలు లభిస్తాయి. గడచిన 3 ఏళ్లుగా ప్రతి ఏటా 2,50,000 మందిని మాత్రమే నియమించుకునేవారు. ప్రస్తుత ఏడాది ఈ సంఖ్యను 3 లక్షలకు పెంచారు. ఉద్యోగులకు గంటకు కనీసం 20 డాలర్లు చెల్లించనున్నారు. సగటు వేతనం 24 డాలర్ల వరకు ఉంటుందని యాజమాన్యం వెల్లడించింది. సీజనల్ సిబ్బందికి కూడా గంటకు 20 డాలర్ల చొప్పున వేతనం దక్కుతుంది. వచ్చే ఏడాది నుంచి 30 గంటలకు పైగా పని చేసే సీజనల్ ఉద్యోగులకు సైతం ఆరోగ్య బీమా వర్తింపజేయనున్నారు. సాధారణ ఫుల్‌టైమ్ సిబ్బందికి అందించే అన్ని రకాల వైద్య సదుపాయాలు వీరికి కూడా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.