HDFC Bank rolls out EV loan with separate battery  
బిజినెస్

ఈవీ కార్ల బ్యాటరీకి సెపరేట్ లోన్

ఈవీ కార్ల బ్యాటరీకి ప్రత్యేక రుణ పథకం ప్రారంభించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సులభతర చెల్లింపులతో వాహనదారులకు ఊరట.

Srinivas Rao

న్యూఢిల్లీ: ఈవీ కారుకు, బ్యాటరీకి వేర్వేరుగా ఆర్థిక సాయం అందించే నూతన రుణ పథకాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీసుకొచ్చింది. ఈ పద్ధతిలో రుణగ్రహీతలు బ్యాటరీకి ఎక్కువ కాలవ్యవధిలో తిరిగి చెల్లించుకునే వీలుంటుంది. ఈ పథకం దేశవ్యాప్తంగా 9,700కు పైగా శాఖల్లో అందుబాటులో ఉందని బ్యాంక్ తెలిపింది. విద్యుత్ వాహనాల ధరలో ఎక్కువ వాటా బ్యాటరీలదే కావడం గమనార్హం. సంప్రదాయ పెట్రోల్ డీజిల్ ఇంజిన్ వాహనాల నిర్వహణ ఖర్చుతో సమానంగా బ్యాటరీ ఈఎంఐ ఉండేలా ఈ పథకాన్ని రూపొందించారు.

 సులభతరమైన చెల్లింపులు

ప్రస్తుతం కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మోడళ్లలో వస్తున్నాయి. వీటి కొనుగోలుకు ఈ నూతన పథకం ఎంతగానో అనుగుణంగా ఉంది. వాహనదారులపై ఆర్థిక భారం పడకుండా దీన్ని తీర్చిదిద్దారు. "ప్రముఖ తయారీ సంస్థల విద్యుత్ వాహనాలకు ఈ రుణం లభిస్తుంది" అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గ్రూప్ హెడ్ అరవింద్ వోహ్రా తెలిపారు.