బిజినెస్

స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు.. ఈ షేర్లకు తప్ప..!

ఫార్మా, హెల్త్‌కేర్, మెటల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 483 పాయింట్లు లాభపడి 73,606.75 వద్ద, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 22,753.20 వద్ద ముగిశాయి.

Madhu

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఫార్మా, హెల్త్‌కేర్, మెటల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు కారణంగా సూచీలు రాణించడంతో నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా, ట్రెంట్, టాటా స్టీల్‌తోపాటు ఇతర పలు షేర్లు లాభపడ్డాయి. మారుతీ సుజూకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టపోయాయి. ఉదయం సెన్సెక్స్ 609 పాయింట్లకు పడిపోయి 72,514.57 వద్ద ట్రేడయ్యింది. అనంతరం పుంజుకున్న సెన్సెక్స్ 482.92 పాయింట్లు (0.66 శాతం) లాభపడి 73,606.75 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం మొదట 212.65 పాయింట్లకు పడిపోయి 22,387 పాయింట్ల వద్ద ట్రేడయ్యింది. ఆ తరువాత క్రమంగా పుంజుకుని 153.20 పాయింట్లు (0.68 శాతం) లాభపడి 22,753.20 వద్ద స్థిరపడింది.

 టాప్ గెయినర్స్

డాక్టర్ రెడ్డీస్ 7.17%, బీఎస్ఈ లిమిటెడ్ 4.47%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4.32%, మ్యాక్స్ హెల్త్ 2.84%, కోటక్ బ్యాంక్ 2.58%, ఎటర్నల్ 2.57%  

 టాప్ లూజర్స్

శ్రీరామ్ ఫైనాన్స్ 4.65%, టాటా కన్స్యూమర్ 3.09%, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 1.28%, బజాజ్ ఫైనాన్స్ 1.09%, నెస్లే ఇండియా 0.95%

 పడిపోయిన రూపాయి

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు నష్టపోయి రూ. 95.22 వద్ద ట్రైడయ్యింది.