న్యూఢిల్లీ:
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) నూతన చైర్మన్గా సునీల్ కుమార్ నియమితులయ్యారు. ఈ నియామకానికి గురువారం కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. డిసెంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఓఎన్జీసీ డైరెక్టర్గా ఉన్న సునీల్ కుమార్ను కేంద్ర పెట్రోలియం శాఖ రెండుసార్లు ఇంటర్వ్యూ చేసి చైర్మన్ పదవికి ఎంపిక చేసింది. అనంతరం ఆయన నియామకానికి సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఓఎన్జీసీలో కంపెనీ డైరెక్టర్ స్థాయి నుంచి చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న తొలి వ్యక్తిగా సునీల్ కుమార్ నిలవనున్నారు. ప్రస్తుత చైర్మన్ అరుణ్ సింగ్ పదవీకాలం డిసెంబర్లో ముగియనుంది.