న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లో నిర్మిస్తున్న తొలి భూగర్భ మెట్రో ప్రాజెక్టు ఢాకా మెట్రో లైన్-1 కోసం ఎల్ అండ్‌టీ సంస్థ రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల విలువైన రెండు కాంట్రాక్టులను దక్కించుకుంది. ఈ ఆర్డర్లలో భాగంగా ట్రాక్ పనులు, విద్యుత్ వ్యవస్థలు, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్, ప్లాట్‌ఫామ్ స్క్రీన్ డోర్లను సంస్థ ఏర్పాటు చేయనుంది.
జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) ఆర్థిక సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు సుమారు 31 కిలోమీటర్ల మేర ఆధునిక ప్రజా రవాణా సదుపాయాన్ని అందించనుంది. ఢాకా మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్ నుంచి మరోసారి ఆర్డర్లు దక్కడం అంతర్జాతీయ పట్టణ రవాణా ప్రాజెక్టులను అమలు చేయడంలో ఎల్ అండ్‌టీ సామర్థ్యానికి నిదర్శనమని ఆ సంస్థ రవాణా మౌలిక సదుపాయాల విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రామ్‌కుమార్ ఎస్ తెలిపారు.