దేశభక్తిని చాటుకున్న రియల్ హీరో
60 రోజులు సైన్యంతో కలిసి పనిచేసిన పాటేకర్
ప్రభాత ఉదయం : బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పాటేకర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. తెరపై తనదైన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన పాటేకర్ కేవలం నటుడు మాత్రమే కాదు. నిజ జీవితంలోనూ దేశభక్తి చాటుకున్నారు. ఇప్పటివాళ్లలో చాలామందికి తెలియని ఆసక్తికరమైన కోణం ఆయన జీవితంలో దాగుంది. 1999 కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సాధారణ పౌరుడిగా యుద్ధ రంగంలో అడుగుపెట్టిన ఆయన తీరు చిరస్మరణీయం. దేశ సేవ కోసం రణరంగానికి వెళ్లిన వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
అనుకున్నది సాధించిన పాటేకర్
దేశం కోసం ఏదైనా చేయాలనే తపనతో నానా పాటేకర్ అప్పట్లో ముందుకు సాగారు. భారత సైన్యంలో ఎలాగైన సేవలు అందించాలని అనుకున్నారు. అయితే సాధారణ పౌరులకు సైన్యంలో ప్రవేశం అంత ఈజీ కాదు. ఈ అడ్డంకిని దాటేందుకు అప్పట్లోని రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను నేరుగా కలిశారు. తన మనసులోని దేశభక్తిని ఆయనకు వివరించారు. మొదట మంత్రి అంగీకరించలేదు. సామాన్యులు యుద్ధ భూమికి వెళ్లడం రూల్స్ ప్రకారం కుదరదని స్పష్టం చేశారు. పట్టువదలని పాటేకర్ తనకున్న ప్రత్యేక అర్హతలను మంత్రికి వివరించారు. తాను కమాండో కోర్సు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆయుధాలను సమర్థంగా ఉపయోగించడంలో మంచి అనుభవం ఉందని తెలిపారు. జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించిన సంగతిని ఆయన గుర్తు చేశారు.
60 రోజులు సైన్యంతో కలిసిన పనిచేసిన పాటేకర్
నానా పాటేకర్ ధైర్యసాహసాలను గుర్తించిన రక్షణ శాఖ మంత్రి ఎట్టకేలకు యుద్ధంలో భాగస్వామి అయ్యేందుకు అంగీకారం తెలిపారు. వెంటనే ఎప్పుడు యుద్ధ భూమిలోకి అడుగుపెడతారని ప్రశ్నించారు. ఏ క్షణంలోనైనా సిద్ధమని పాటేకర్ బదులిచ్చారు. అలా సుమారు 60 రోజుల పాటు భారత సైన్యంతో కలిసి ఆయన పనిచేశారు. ద్రాస్, లెహ్, కుప్వారా, బారాముల్లా, సొపొరీ వంటి అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటించారు. సైనికులతో భుజం కలిపి నడిచారు. క్విక్ రియాక్షన్ టీమ్‌లో కీలక సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. యుద్ధ భూమిలో తను గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆ జ్ఞాపకాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సైన్యంతో ఉన్న సమయంలో కాలమే తెలియలేదని ఆయన ఎమోషనల్ అయ్యారు.
20 కేజీలు తగ్గిన నానా
యుద్ధ రంగానికి వెళ్లే నాటికి నానా పాటేకర్ బరువు 76 కిలోలు. తిరిగే వచ్చేసరికి ఆయన 56 కిలోలకు తగ్గిపోయారు. దేశ రక్షణ కోసం సైనికులు పడే కష్టాన్ని స్వయంగా అనుభవించారు. తెరపై ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, శక్తిమంతమైన నాయకుడిగా విలక్షణ పాత్రలు పోషించారు. తెరవెనుక సామాజిక సేవా కార్యక్రమాలతో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్ వంటి నటులు కంటతడి పెట్టారు. పాటేకర్ ఆకస్మిక మృతి చిత్ర పరిశ్రమకు పూడ్చలేని లోటు అని ప్రముఖ నటులు నివాళులర్పించారు.