Samantha  Silverscreen Media Inc.
సినిమా

మొత్తానికి సాధించావ్!

ఎన్నో సవాళ్లను అధిగమించి తనను తాను నమ్మడం నేర్చుకున్న సమంత అంతరంగపు ఆలోచనలు. ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ, స్వీయగుర్తింపు, కలల సాధనకు స్ఫూర్తినిచ్చే భావోద్వేగ కథనం.

Surya

ఇప్పుడు నువ్వో స్వేచ్ఛా విహంగానివి!

కానీ, నీపై నీకు ఈ నమ్మకం కలగడానికి ఎన్నో ఏళ్లు పట్టింది..

అన్నింటా నీకూ అర్హత ఉందని నమ్మడానికి,

నీ విలువను నువ్వు గుర్తించడానికి ఎంతో సమయం పట్టింది.

నువ్వు కష్టపడతావని నీకు తెలుసు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీ ప్రయత్నాన్ని ఆపవని తెలుసు.

జీవితం నిన్ను నిర్భంధంలోకి నెట్టాలని చూసింది..

ఆ హద్దులను చెరిపేసేందుకు నీ శక్తినంతా ధారపోశావు.

కానీ, తత్వం బోధపడే ప్రక్రియలో కాలం మంచులా కరిగిపోయింది...

ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడం,

అంతరాత్మ చెప్పే మాటను విశ్వసించడం,

నీ అనుభవాన్ని, నీ జ్ఞానాన్ని నమ్ముకోవడం...

ఇవన్నీ కనుగొనేసరికి చాలా సమయమే పట్టింది.

అయినా పర్వాలేదు బేబీ గర్ల్..

జీవితంలో సగభాగం ఇందుకోసమే వెచ్చించినా...

నిన్ను నువ్వు కనుగొన్నావు కదా! అందుకు నువ్వు గర్వపడాలి.

ఎందుకంటే నీ చుట్టూ కనిపించని నిబంధనలను నువ్వు అధిగమించావు.

నీ చుట్టూ ఉన్న హద్దులను చెరిపేశావు.

నిన్ను కుదించేందుకు నిర్మించిన గోడలను కూల్చేశావు.

ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు!

నీ కలల రెక్కలతో అనంతమైన ఆకాశంలో విహరించడానికి,

అపరిమితమైన అవకాశాలను అన్వేషించడానికి,

నీ మనసు కోరుకున్న జీవితాన్ని నీదైన రీతిలో జీవించడానికి

ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు.

నువ్వు ఉండాల్సిన చోటే ఇప్పుడు ఉన్నావు.

నువ్వు చేరాల్సిన మజిలీకే ప్రయాణిస్తున్నావు.

ఎందుకంటే నీ జీవితంలోనే అత్యంత అద్భుతమైన అధ్యాయం

ఇంకా మొదలుకావాల్సి ఉంది.

కాబట్టి, బేబీ గర్ల్

నిన్ను నువ్వు నమ్మగలిగినందుకు గర్వపడు.

నువ్వు దాటివచ్చిన దారిని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు.

ఎన్ని కన్నీళ్లను దిగమింగావో,

ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నావో,

ఎన్ని సార్లు పడిపోయినా మళ్లీ ఎలా లేచి నిలబడ్డావో గుర్తుచేసుకో.

ఎందుకంటే.. నీ జీవితంలో అత్యంత అందమైన రోజులు ఇంకా ముందే ఉన్నాయి.