ఎనిమిది యుద్ధాలు ఆపాను
ప్రపంచంలో ఎవరైనా నాలా గొప్ప పనులు చేశారా?
ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ప్రభాత ఉదయం, ఇంటర్నేషనల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ చాటింపు వేసుకున్నారు. తానేమీ గొప్పలు చెప్పడం లేదని, ఉన్న వాస్తవమే మాట్లాడుతున్నానని చెప్పారు. ఓ వైపు ఇరాన్‌తో యుద్ధం చేస్తోన్న అమెరికా, శాంతి బహుమతి ప్రకటన వేళ ఇలాంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఎనిమిది యుద్ధాలు ఆపాను
‘అసలు ప్రపంచంలో ఇంకెవరూ చేయలేని గొప్ప పనులు నేను చేశాను. నేను అబద్ధాలు చెప్పడం లేదు. వాస్తవాలే మాట్లాడుతున్నా. ఇంతవరకు ఏ అధ్యక్షుడు కూడా ఇన్ని యుద్ధాలను ఆపలేదు. పరిష్కారం చూపలేదు. నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను. నోబెల్ శాంతి బహుమతిని పొందడానికి నేను కచ్చితంగా అర్హుడిని. కానీ నాకు వస్తుందనే నమ్మకం తక్కువగా ఉంది. నోబెల్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. నాలాంటి వారికి ఈ పురస్కారం ఇవ్వకపోవడమే వారికి ఓ అలవాటుగా కనిపిస్తోంది’ అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్‌కు మళ్లీ నిరాశ తప్పదా?
నోబెల్ శాంతి బహుమతిని ఏటా నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికిగానూ ఈ పురస్కారాన్ని శుక్రవారం ప్రకటించనున్నారు. గతేడాది కూడా నోబెల్‌పై ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశలు అడియాశలు అయ్యాయి. 2025లో వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు బహుమతి దక్కడంతో ట్రంప్‌కు నిరాశ తప్పలేదు. ఈ ఏడాది నామినేషన్లలో ట్రంప్ పేరు ఉండొచ్చని గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఎవరిని వరిస్తుందో అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.