ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
హౌతీపై సౌదీ ప్రతీకార దాడులు
ప్రభాత ఉదయం, నేషనల్ డెస్క్: ఇరాన్ మద్దతుతో సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకొని హౌతీలు దాడులకు దిగారు. తాజాగా అబ్హా, రియాద్ ఎయిర్‌పోర్టులపై దాడులు చేయగా, ఈ ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. 36 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని సౌదీ పౌర విమానయాన శాఖ బుధవారం ధృవీకరించింది. బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు దిగినట్టు వెల్లడించింది. సౌదీని ఆర్థికంగా దెబ్బతీసి, తమ డిమాండ్లకు లొంగిపోయేలా చేసేందుకు ఈ దాడులకు హౌతీలు పాల్పడినట్టు తెలుస్తోంది.
అమెరికా వార్నింగ్
హౌతీల దాడుల నేపథ్యంలో అమెరికా అలర్ట్ అయింది. సౌదీలోని తమ పౌరులను అప్రమత్తంగా ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. విమానాల రద్దు, ఎయిర్‌స్పేస్ మూసివేతలకు అవకాశం ఉందని హెచ్చరించింది. అటు అమెరికా ఆదేశాల మేరకు సౌదీ అరేబియాకు రక్షణగా సైన్యాన్ని మోహరించేందుకు పాకిస్తాన్, టర్కీ అంగీకరించాయి.