Qantas flight QF5 from Perth to Rome faced difficulties due to a bedbug infestation 
అంతర్జాతీయం

విమానాన్ని నిలిపివేసిన నల్లులు

క్వాంటాస్‌ విమానంలోని ఎకానమీ సీట్లలో నల్లులు కనిపించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానంలో పెస్ట్‌ కంట్రోల్‌, లోతైన శుభ్రత చేపట్టారు.

Srinivas Rao

సిడ్నీ: ఆస్ట్రేలియా జాతీయ విమానయాన సంస్థ క్వాంటాస్ సర్వీసుకు నల్లుల బెడద కారణంగా అంతరాయం ఏర్పడింది. పెర్త్ నుంచి రోమ్ వెళ్లిన క్వాంటాస్ 'క్యూఎఫ్5' విమానం ఇటలీలో అర్ధాంతరంగా దిగిపోవడం ప్రయాణికులు చేదు అనుభవం మిగిల్చింది. అక్టోబర్ 9న విమానంలోని ఎకానమీ విభాగంలో ప్రయాణించిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సామాగ్రిపై, బట్టలపై, దుప్పట్లపై నల్లులు పాకుతుండటంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గాల్లో వేలాది అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తున్న సమయంలో సీట్ల మధ్య నుంచి నల్లులు బయటికి వచ్చి ప్రయాణికులను తీవ్రంగా కుట్టాయి. దీంతో వీరి ప్రయాణం అర్దాంతరంగా నిలిచిపోయింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది.

 ఇంజినీరింగ్ తనిఖీలు, లోతైన శుభ్రత

ఈ ఘటనపై క్వాంటాస్ స్పందించింది. ఎకానమీ సీట్లలో తలెత్తిన ఈ సమస్యపై సాంకేతిక బృందాలు వెంటనే విచారణ జరిపాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రోమ్ నుంచి పెర్త్ బయలుదేరాల్సిన విమాన సర్వీసును పూర్తిగా రద్దు చేశారు. ఇంజినీరింగ్, మెయింటెనెన్స్ సిబ్బంది విమానంలో నల్లుల నివారణ కోసం పెస్ట్ కంట్రోల్ చేపట్టారు. ప్రయాణికులకు వసతి సౌకర్యం కల్పించి, ఇతర విమానాల్లో ప్రయాణ ఏర్పాట్లు చేశారు.

 సీట్ల మధ్య గుట్టుగా కాపురాలు

విమాన సర్వీసులు వేగంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నప్పటికీ, నిర్వహణలో చిన్న లోపాలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. సుదీర్ఘంగా సాగే 12 గంటల ప్రయాణాలలో శుభ్రత లోపించడం వల్ల ఇలాంటి కీటకాలు సీట్ల కుషన్లలో ఆశ్రయం పొందుతున్నాయి. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత మనుషుల శరీర ఉష్ణోగ్రతను పసిగట్టి ఇవి బయటికి వస్తున్నాయి. వీటి వల్ల ప్రయాణికులు ఎంతగా ఇబ్బంది పడినా, గాల్లో ఉండటం వల్ల దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. నల్లుల భారిన పడ్డ ప్రయాణీకులకు క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. జరిగిన అసౌకర్యానికి సంస్థ క్షమాపణ కోరింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

 నల్లుల వ్యాప్తి - నివారణ

నల్లులు చిన్నవిగా, చదునుగా, ఎరుపు-గోధుమ రంగులో ఉంటాయి. నిద్రపోతున్న మనుషులను కుట్టి రక్తాన్ని పీల్చుకుంటాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. ఇవి లగేజీ కుట్లు, దుస్తులు, బెడ్డింగ్, ఫర్నిచర్ వంటి ప్రాంతాలలో దాక్కుంటాయి. ప్రయాణాలు చేసే సమయంలో ఈ కీటకాలు ఒక చోటి నుంచి మరో చోటికి సులభంగా మారుతాయి. వీటి కాటుకు సాధారణ లోషన్లు సరిపోతాయని, అయితే నల్లులు సోకిన ప్రాంతాలను పెస్ట్ కంట్రోల్ ద్వారా శుభ్రం చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.

 దాగి ఉండి దాడి చేసే నల్లులు