In South Korea Incheon Mall Eight People were Injured By Knife Attack 
అంతర్జాతీయం

మాల్​ లో కత్తితో దాడి.. 8మందికి గాయాలు

దక్షిణకొరియాలోని ఇంచియాన్ మాల్‌లో 59 ఏళ్ల వ్యక్తి కత్తులతో దాడి చేయడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Boddupalli Naresh

సియోల్​: దక్షిణకొరియా ఇంచియాన్​ సిటీలోని ఓ మాల్​లో కస్టమర్లపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో 8 మందికి గాయాలైనట్లు పోలీసులు, ఫైర్​ ఆఫీసర్లు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. నామ్‌డాంగ్ జిల్లాలోని ఓ మాల్‌లో 59 ఏండ్ల వ్యక్తి కత్తులతో కస్టమర్లపై దాడి చేశాడు. ఈ దాడిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మాల్​ సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డుకొని పట్టుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ 20 ఏళ్ల మహిళకు సీరియస్​గా ఉండడంతో హాస్పిటల్​కు తరలించి సర్జరీ చేశారు. మిగతావారిని సమీపంలోని హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ దాడికి గల కారణాలను తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దుండగుడి రెండు కత్తులు పట్టుకొని ఉన్నట్లు కనిపించిందని ఓ ప్రత్యక్ష సాక్షి దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్‌హాప్​కు తెలిపాడు. ‘మాల్‌ బేస్‌మెంట్‌లోని డిస్కౌంట్‌ స్టోర్‌లో ఆ వ్యక్తి తొలుత కత్తులతో దాడి చేయడం ప్రారంభించాడని, అనంతరం ఎస్కలేటర్‌ ద్వారా పైకి వెళ్తూ ఇతరులపై కూడా దాడి చేశాడు. మాల్​ సిబ్బంది, మరికొందరు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు’ అని చెప్పాడు.