Modi and Putin have set a target to increase bilateral trade between India and Russia to $100 billion by 2030 
అంతర్జాతీయం

భారత్‌-రష్యా ఆర్థిక సంబంధాలకు కొత్త ఊపు

భారత్‌–రష్యా సంబంధాల్లో వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి కీలక పాత్ర పోషించనున్నాయి. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.

Madhu

న్యూఢిల్లీ: భారత్‌, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతోపాటు, 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం తీసుకున్నారని రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం సంబంధిత ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేయాలని ఇరు దేశాల నాయకులు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. రష్యాకు చెందిన న్యూస్ ఏజెన్సీ టీఏఎస్ఎస్‌కు శనివారం ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ, పుతిన్‌ భారత్‌-రష్యా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు వినయ్ కుమార్ తెలిపారు. “కార్మిక రంగంలోనూ భారత్‌-రష్యా సహకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. రష్యా అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన కార్మికులను అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది. వారికి భారత్‌లో విద్యా, శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని రష్యాకు భారత్‌ ప్రతిపాదించింది” అని వినయ్ కుమార్ తెలిపారు.