ప్రభాత ఉదయం, బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఎక్సైజ్ శాఖ తాజాగా గణాంకాలను విడుదల చేసింది. తమ శాఖకు వచ్చే ఆదాయం రెట్టింపై 12.54 శాతానికి చేరిందని తెలిపింది. కేవలం జులై-సెప్టెంబర్ నెలల్లో 126.68 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వగా, రూ. 11,595 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. ఇది గత సంవత్సరంతో పోలీస్తే రూ. 1,294 కోట్లు ఎక్కువని పేర్కొన్నది. రానున్న రోజుల్లో కర్ణాటకలో బీర్లు తాగే వారి సంఖ్య మరింతగా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు చమత్కరిస్తున్నారు.