UK Trade Secretary Visits India to Fast-Track Free Trade Agreement Implementation 
జాతీయ వార్తలు

భారత-బ్రిటన్ మధ్య రూ. 25 లక్షల కోట్ల వాణిజ్య ఒప్పందాలు

భారత్‌తో వాణిజ్య సంబంధాలను విస్తరించేందుకు యూకే ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో బిలియన్ పౌండ్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.

Srinivas Rao

లండన్: భారత్, యూకే దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. రూ. 24,39, 95,25,000.00  (24లక్షల 39 వేల 369 కోట్లు) విలువైన ఫ్రీ ట్రేడ్ ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఫలాలను పూర్తిగా సాధించే దిశగా తొలి బ్రిటన్ ప్రతినిధి బృందం భారత్‌లో అడుగుపెట్టింది. ఈ పర్యటన సందర్భంగా సుమారు మొదటి అడుగుగా ఒక బిలియన్ పౌండ్ల విలువైన కొత్త ఒప్పందాలు కుదిరినట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత లోతుగా వేళ్లూనుకునేలా చేయడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం.

 నూతన భాగస్వామ్యాలు.. పెట్టుబడులు

యూకే బిజినెస్ సెక్రటరీ జోనాథన్ రినాల్డ్స్, స్కాట్లాండ్ సెక్రటరీ డగ్లస్ అలెగ్జాండర్, పర్యావరణ శాఖ మంత్రి ఏంజెలా ఈగిల్ నేతృత్వంలో, వివిధ రంగాలలో వందకు పైగా వ్యాపార సంస్థల ప్రతినిధులు, ఉత్తర ఇంగ్లాండ్ మేయర్లు ఈ బృందంలో ఉన్నారు. భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) అమల్లోకి వచ్చిన 3 నెలల వ్యవధిలోనే ఈ 'గ్రేట్ నార్త్' మిషన్ ప్రారంభం కావడం గమనార్హం. మెటా ద్వారా డేటా టెక్నాలజీస్‌లో 50 మిలియన్ పౌండ్ల పెట్టుబడి, మెన్జీస్ ఏవియేషన్ సంస్థ ద్వారా భారత్‌లో 600 మిలియన్ పౌండ్ల ఆదాయాన్ని ఆర్జించేలా ఒప్పందాలు కుదిరింది.

 ప్రాంతీయ ఆర్థిక సహకారం

ఈ పర్యటనలో భాగంగా జోనాథన్ రినాల్డ్స్ భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమై జెట్కో సమావేశానికి సహ-అధ్యక్షత వహించనున్నారు. అలాగే కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి సైన్స్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్‌ను పర్యవేక్షిస్తారు. ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని మరింత విస్తృతం చేయనున్నారు. లండన్‌కు చెందిన ఏఐ స్టార్టప్ 'అసికా' హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే 'ఆర్సెస్' ముంబై మెట్రో డిజైన్ రివ్యూ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది.

 అద్భుతమైన ప్రయోజనాలు

భారత్‌తో కుదిరిన ఈ చారిత్రక ఒప్పందం సాల్మన్, విస్కీ వంటి నాణ్యమైన ఉత్పత్తులకు పెద్ద మార్కెట్‌ను తెరుస్తుందని స్కాట్లాండ్ సెక్రటరీ డగ్లస్ అలెగ్జాండర్ పేర్కొన్నారు. స్కాట్లాండ్ ఉత్పత్తిదారులు ఈ వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకునేలా అన్ని విధాలుగా సహాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా దీర్ఘకాలంలో ప్రతి ఏటా ద్వైపాక్షిక వాణిజ్యం 25.5 బిలియన్ పౌండ్లు పెరుగుతుందని అధికారిక అంచనాలు వెల్లడించాయి.

 అత్యున్నత స్థాయి వాణిజ్య వేదిక

భారత్, యూకే దేశాల మధ్య ఉన్న సుసంపన్నమైన సంబంధాలను ఈ పర్యటన అద్దం పడుతోంది. వ్యవసాయం, హార్టికల్చర్, మాంస పరిశ్రమ, స్కాటిష్ విస్కీ అసోసియేషన్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఈ బృందంలో భాగస్వామ్యలయ్యారు. వాణిజ్య ఖర్చులను తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు మరింత ప్రాధాన్యం కల్పించడం లక్ష్యంగా ఈ ఒప్పందాలు రూపుదిద్దుకున్నాయి. 'వన్ నేషన్, వన్ ట్రేడ్, వన్ పాలసీ' దార్శనికతతో ముందుకు సాగుతున్న ఈ ప్రణాళికలు రెండు దేశాల వినియోగదారులకు, వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయని నిపుణులు విశ్లేషించారు.