Gold bars worth over ₹2.08 crore seized in Chennai airport 
జాతీయ వార్తలు

చెన్నై విమానాశ్రయంలో రూ.2.08 కోట్ల విలువైన బంగారం స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరిని పట్టుకుని వారి వద్ద నుంచి కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Suryanarayana

చెన్నై : చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ.2.08 కోట్ల విలువైన 1.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సింగపూర్‌ నుంచి వచ్చిన ఇద్దరు భారతీయులు పసుపు రంగు పేస్ట్‌తో కూడిన మూడు క్యాప్సూల్స్‌ను శరీరంలో దాచుకుని బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వాటిని వెలికితీసి ప్రాసెస్ చేయగా, మొత్తం 1,565 గ్రాముల బరువున్న రెండు బంగారు కడ్డీలు లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.2.08 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కస్టమ్స్ చట్టం ప్రకారం బంగారాన్ని సీజ్ చేసి, నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు విమానాశ్రయ కస్టమ్స్ జాయింట్ కమిషనర్ కేఎం గురురాజేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ— ‘‘డబ్బు, ఉచిత ప్రయాణాలు, ఇతర ప్రలోభాలు చూపి క్యారియర్లుగా మార్చుకునే స్మగ్లింగ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన ఆశలకు పోయి ఇతరుల వస్తువులను తరలించి చిక్కుల్లో పడకండి’’ అని హెచ్చరించారు.