బెంగళూరు: ‘సర్’ నిరసనల్లో పాల్గొన్న యూట్యూబర్ ధ్రువ్ రాఠీ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్, వీసా నిబంధనలపై విచారణ జరపాలని బెంగళూరు మాజీ సీపీ భాస్కర్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అక్టోబర్ 8న (గురువారం) బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా పౌర సంఘాలు, సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ధ్రువ్ రాఠీ పాల్గొన్న విషయం తెలిసిందే.
ఏ పాస్ పార్ట్‌తో వచ్చారు?
ధ్రువ్ రాఠీకి జర్మన్ పౌరసత్వం ఉందని భాస్కర్ రావు ఆరోపించారు. అతడు ఏ పాస్‌పోర్టుతో భారత్‌లోకి ప్రవేశించారని ప్రశ్నించారు. ఏ కేటగిరీ వీసా అనుమతితో దేశంలో ఉంటున్నారో పరిశీలించాలని కేంద్రహోంశాఖను కోరారు. పర్యటన ఉద్దేశం ఏమిటి? ఆయనకు వర్తించే వీసా నిబంధనలు ఏమిటి? అనే అంశాలను పరిశీలించాలని డిమాండ్ చేశారు.
విదేశీ పౌరుడు నిరసనల్లో పాల్గొనవచ్చా?
రాజకీయ నిరసనలో విదేశీ పౌరుడు పాల్గొనడాన్ని నిబంధనలు అనుమతిస్తున్నాయా? అంటూ లేఖలో ప్రస్తావించారు. వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ నియమాలు, విదేశీయుల చట్టం-1946, ఓసీఐ నిబంధనల ఉల్లంఘన జరిగితే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.