FIR against Rahul, Priyanka Gandhi for entering Akashvani Bhawan 
జాతీయ వార్తలు

రాహుల్ గాంధీ, ప్రియాంకపై ఎఫ్ఐఆర్

Suryanarayana
  • అనుమతి లేకుండా ఆకాశవాణి ప్రాంగణంలోకి ప్రవేశించారని ఆరోపణలు

  • ఢిల్లీ పోలీసులు కేసు నమోదు

  • పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్న ప్రతిపక్షాలు

ఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ఇండియా కూటమి మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. పోలీసులు బారికేడ్లతో ఆందోళనకారులను అడ్డుకోవడంతో, నేతలు ఆకాశవాణి భవన్ ఆవరణలోకి ప్రవేశించి తొమ్మిది గంటల పాటు బైఠాయించారు. ప్రభుత్వ కార్యాలయ ఆవరణలోకి అనుమతి లేకుండా చొరబడ్డారంటూ ఆకాశవాణి సిబ్బంది, భద్రతా అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని పోలీసులు వారిని కోరారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లను కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని, అప్పటి వరకు కదిలేది లేదని నేతలు బైఠాయించారు. భద్రతకు సంబంధిత పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, విచారణ కొనసాగుతోందని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.