అహ్మదాబాద్: గుజరాత్ మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలా ఎన్నికల కమిషన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసే అధికారులను బహిరంగంగా ఉరితీయాలని అన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నవేళ వాఘేలా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే అధికారులను క్షమించకూడదని, అలాంటి కమిషర్లను బహిరంగంగా ఉరితీయాలని పేర్కొన్నారు. వారిపై కనికరం చూపకూడదని, ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాల్సి ఉంటుందని వాఘేలా తెలిపారు. అయితే ప్రస్తుత ఎన్నికల కమిషన్‌లోని కొంతమంది అధికారులు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి సూచనల మేరకు ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, వాఘేలా వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో ఎదురైన పరాజయాల కారణంగా రాజ్యాంగ సంస్థలపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పుబట్టారు.