FSSAI issues notices to BigBasket, Flipkart, Gemini Edibles over misleading claims 
జాతీయ వార్తలు

బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు

నూనె విక్రయాల్లో ఆరోగ్య ప్రయోజనాలపై తప్పుడు ప్రకటనలు, లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో పలు సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు ఇచ్చింది.

Srinivas Rao

హైదరాబాద్: ప్రముఖ సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) గట్టి షాక్ ఇచ్చింది. తప్పుదోవ పట్టించే ఆరోగ్య ప్రకటనలతో నూనె విక్రయిస్తున్న వ్యవహారంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్‌తో పాటు బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

 తప్పుడు ప్రకటనలకు లైసెన్సులు రద్దు

ఫ్రీడమ్ కుకింగ్ రైస్ బ్రాన్ ఆయిల్ విక్రయాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంటూ తప్పుడు ప్రకటనలు చేయడంపై అథారిటీ తీవ్రంగా స్పందించింది. సరైన లైసెన్స్ లేకుండా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎఫ్‌ఎస్‌ఎస్ చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు తనిఖీల్లో తీవ్ర ఉల్లంఘనలు వెలుగుచూడటంతో డీఎన్‌వీ ఫుడ్ ప్రొడక్ట్స్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. నిబంధనలను పాటించని మరో సంస్థ లైసెన్స్‌ను