Here is why do Sculptors use soil from a sex-worker’s home to make Maa Durga's idol wikimedia commons
జాతీయ వార్తలు

మట్టికి పవిత్రత ఉంది.. మహిళలకు గౌరవం లేదా?

బెంగాల్‌లో దుర్గాపూజ సందర్భంగా ..దుర్గాదేవి విగ్రహం తయారికి వాడే మట్టిని పుణ్యమాటి అని పిలుస్తారు. ఇందులో సెక్స్ వర్కర్ల ఇంటి గుమ్మం వద్ద నుంచి సేకరించిన మట్టిని కూడా (నిషిద్దో పల్లి) కలుపుతారు.

Surya

దుర్గాపూజ సందర్భంగా బెంగాల్‌లో ఒక సంప్రదాయం ఉంది. దుర్గాదేవి విగ్రహం తయారుచేసే మట్టిని పుణ్యమాటి అని పిలుస్తారు. ఇందులో సెక్స్ వర్కర్ల ఇంటి గుమ్మం వద్ద నుంచి సేకరించిన మట్టిని కూడా (నిషిద్దో పల్లి) కలుపుతారు. సమాజం చిన్నచూపు చూసే ఒక మహిళ ఇంటి గుమ్మం మట్టిని పవిత్రంగా భావించి అదే మట్టితో దుర్గాదేవి విగ్రహాన్ని తయారుచేస్తాం. కానీ ఆ మహిళకు మాత్రం సమాజంలో గౌరవం, సమానత్వం ఎందుకు లభించడం లేదు?

ఈ ఆచారంలో ఒక గొప్ప సందేశం దాగి ఉన్నది. పవిత్రత అనేది మట్టికి, వస్తువులకు మాత్రమే పరిమితం కాకూడదు. ప్రతి మనిషికీ గౌరవం దక్కాలి. వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళలందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొందరు బలవంతపు పరిస్థితులకు బలై ఉంటారు. మరికొందరు పేదరికం, నిరాదరణ వంటి కారణాలతో ఆ వృత్తిలోకి వచ్చి ఉంటారు. వారి పరిస్థితులను అర్థం చేసుకోవడం, వారిని అవమానించకుండా గౌరవించడం మన బాధ్యత.

దుర్గాపూజలో స్త్రీశక్తిని ఆరాధిస్తాం. దుర్గాదేవిని తల్లిగా భావించి పూజిస్తాం. కానీ నిజ జీవితంలో మహిళలకు గౌరవం ఇవ్వలేకపోతే ఆ ఆరాధనకు అర్థం ఏమిటి? దేవతను పూజించే మనం ప్రతి మహిళను గౌరవించడం నేర్చుకోవాలి. మట్టిని పవిత్రంగా భావించే సమాజం ఆ మట్టికి కారణమైన మహిళను కూడా మనిషిగా గౌరవించాలి. అదే దుర్గాపూజ ఇచ్చే నిజమైన సందేశం.