జాతీయ వార్తలు

స్టాక్ మార్కెట్లకు మళ్లీ నష్టాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 251 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్లు పడిపోయాయి. బంగారం, వెండి ధరలూ తగ్గాయి.

Madhu

బెజినెస్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఫార్మా, హెల్త్ కేర్, ఆర్థిక రంగాలకు చెందిన కంపెనీలు భారీగా నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 251.89 పాయింట్లు (0.34 శాతం) నష్టపోయి 72,781 వద్ద ముగిసింది. నిఫ్టీ 99.25 పాయింట్లు (0.44 శాతం) నష్టపోయి 22,622.70 వద్ద స్థిరపడింది.

 మిశ్రమ ఫలితాలు

నిఫ్టీ సూచీలో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. పలు కంపెనీల షేర్లు భారీగా నష్టపోగా, మరికొన్ని కంపెనీల షేర్లు లాభాలను చవిచూశాయి. శ్రీరాం ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండిగో కంపెనీల షేర్లు 2-3 శాతం, సన్ ఫార్మా, ఎల్‌అండ్‌టీ, అదానీ పోర్ట్స్, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, తిదాల్ 1 శాతం వరకు నష్టపోయాయి. ఇన్‌ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు 2 శాతం లాభపడ్డాయి. హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్, బీఈఎల్ షేర్లు 1 శాతం వరకు లాభాలను గడించాయి.

 నష్టాలకు కారణాలు

అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితులు, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 0.30 శాతానికి పెరిగి 106 డాలర్లకు చేరుకోవడం, ఈక్విటీ షేర్ల విక్రయాలు, ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా మదుపరులు స్టాక్ మార్కెట్లో షేర్ల కొనుగోలుకు ఆసక్తిని చూపడంలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

 బలపడిన రూపాయి

డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 95.15 వద్ద స్థిరపడింది.

 తగ్గిన బంగారం ధరలు

పసిడి ధరలు బుధవారం తగ్గాయి. రూ.478 (0.42 శాత) తగ్గి పది గ్రాములు(24 క్యారెట్లు) బంగారం ధర రూ.1,47,972గా పలికింది. వెండి ధర 0.90 శాతం తగ్గి రూ.2,17,227కు చేరుకుంది.