Newlywed woman found hanging at marital home in UP’s Amethi 
జాతీయ వార్తలు

అత్తారింట్లో శవమైన నవవధువు

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ప్రేమ వివాహం చేసుకున్న 23 ఏళ్ల రోషిణి అత్తారింట్లో మృతిచెందింది. తమ కుమార్తెను హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

Vijay Bhaskar

లఖ్​నవూ: ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ వధువు అత్తారింట్లో శవమై తేలింది. యువతి ఉరేసుకోగా, ముమ్మాటికీ హత్యేనని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ జిల్లా పిపర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిపూర్​కు చెందిన ఓ రాహుల్​, సమీప గ్రామానికి చెందిన రోషిణి(23) ప్రేమించుకొని కొద్దిరోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే రోషిణి మంగళవారం అత్తారింట్లో ఉరేసుకొని కనిపించింది. అయితే ఈ వివాహం ఇష్టంలేని అత్తామామలే తన కూతురిని హత్య చేశారని ఆరోపిస్తూ మృతురాలి తల్లి విమలాదేవి పిపర్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను శిక్షించాలని పోలీసులను వేడుకున్నారు. ఈ ఘటనపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్​కు తరలించామని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.