Former Jammu and Kashmir Chief Minister Farooq Abdullah 
జాతీయ వార్తలు

పొరుగుదేశమే మనల్ని కాపాడుతోంది

ఫరూఖ్ అబ్దుల్లా భారత్, పాకిస్థాన్ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ మాట్లాడుతుండటం వల్లే కశ్మీరీలకు భద్రత లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Haji Pasha

‘‘మన పొరుగుదేశం(పాకిస్థాన్​) చాలా చోట్లకు వెళ్లి కశ్మీరీల గురించి మాట్లాడుతోంది. కశ్మీర్​ సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదని చెబుతోంది. అందుకే జమ్మూకశ్మీర్​ ప్రజలకు భద్రత లభిస్తోంది. కశ్మీరీల విషయంలో భారత్​కు సరైన ఉద్దేశాలు లేవు. అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్లే కశ్మీరుపై భారత సర్కారు మౌనం వహిస్తోంది. ఢిల్లీ నుంచి కశ్మీరీలు ఏం ఆశిస్తారు ? వాళ్లు మనకు న్యాయం చేస్తారని అనుకుంటున్నారా ? పోరాడే ధైర్యం లేకుంటే, మనం తుడిచి పెట్టుకుపోతాం” అని జమ్మూకశ్మీర్​ మాజీ సీఎం ఫరూఖ్​ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.