PM Modi to visit Bihar in November for Vikramshila Central University foundation  
జాతీయ వార్తలు

వచ్చే నెల 20న బీహార్​కు ప్రధాని మోదీ

నవంబర్ 20న బీహార్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. భాగల్‌పూర్ జిల్లాలో విక్రమశిల సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు.

Srinu

పాట్నా: ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్​ 20న బీహార్‌లో పర్యటించనున్నారు. భాగల్‌పూర్​ జిల్లా కహల్‌గావ్‌లో విక్రమశిల సెంట్రల్​ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నట్లు బీజేపీ నేతలు బుధవారం వెల్లడించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రధాని బీహార్​లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నవంబర్‌లో ప్రధాని బీహార్​ పర్యటన ఖరారైందని, అధికారికంగా ధృవీకరించాల్సి ఉందని బీజేపీ మీడియా ఇన్‌చార్జ్​ డానిష్​ ఇక్బాల్​ తెలిపారు. కహల్‌గావ్‌లోని అంతిచాక్​ వద్ద గల పురాతన బౌద్ధ విజ్ఞాన కేంద్రం(విక్రమశిల) సమీపంలో కొత్త సెంట్రల్​ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. పాల సామ్రాజ్య కాలం(9వ శతాబ్దం)లో ఈ పురాతన అభ్యసన కేంద్రం ఏర్పాటైంది. ఈ ప్రాజెక్టు కోసం అంతిచాక్, మలక్‌పూర్​ ప్రాంతాల్లో 205 ఎకరాల భూమిని బీహార్​ ప్రభుత్వం కేటాయించింది. విక్రమశిల కీర్తిని పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని బీహార్​ సీఎం సామ్రాట్​ చౌదరి జూన్‌లో ప్రకటించారు. దీంతోపాటు ప్రధాని గోరఖ్‌పూర్-సిలిగురి, రక్సాల్-హల్దియా, పాట్నా-పూర్ణియా రోడ్డు కారిడార్లు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే ప్రాజెక్టులు, కచ్చి దర్గా-బిదుపూర్​ రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.