ప్రభాత ఉదయం, హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మెయిన్స్ ఫలితాలు గురువారం అధికారికంగా వెలువడ్డాయి. ఆగస్టు 21 నుంచి 30 వరకు జరిగిన పరీక్షా ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది 1,016 సివిల్ సర్వీసెస్ ఖాళీల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించగా 2,526 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. అభ్యర్థులు upsc.gov.in లో 'Written Results' సెక్షన్లో ఫలితాల పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చని యూపీఎస్సీ పేర్కొంది.