కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్త సమీర్ ఘోష్ (35) హత్యకు గురయ్యారు. మాల్దా జిల్లాలోని రామ్కేలీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై పదునైన ఆయుధంతో దాడి చేసి, రెండుసార్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మాల్దా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందినవారే ఈ హత్యకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఘర్షణలు మళ్లీ చెలరేగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. బెంగాల్లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి.