రాజకీయం

బీజేపీ పాదయాత్ర రూట్ మార్పు

వచ్చే నెల రెండో తేదీన బీజేపీ తలపెట్టిన ‘లోక్‌తంత్ర బచావో’ పాదయాత్ర రూట్‌కు సంబంధించి మార్పులు జరిగినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచదర్‌రావు శుక్రవారం తెలిపారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : వచ్చే నెల రెండో తేదీన బీజేపీ తలపెట్టిన ‘లోక్‌తంత్ర బచావో’ పాదయాత్ర రూట్‌కు సంబంధించి మార్పులు జరిగినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచదర్‌రావు శుక్రవారం తెలిపారు. మొదట ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో నిర్వహించాలని భావించినా, భారీ జనసమీకరణ, భద్రతా కారణాల దృష్ట్యా రూటు మార్చినట్టు చెప్పారు. మారిన రూట్‌మ్యాప్ ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు బషీర్‌బాగ్‌లోని నిజాంకాలేజీ ఎదురుగా ఉన్న బాబుజగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి మొజాంజాహి మార్కెట్ చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. మొజాంజాహి చౌరస్తా వద్ద జరిగే సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తారని చెప్పారు. ఈ పాదయాత్రతోపాటు అన్ని నియోజకవర్గాలలో సభలు, విద్యార్థుల అవగాహన సదస్సులు, జిల్లా కేంద్రాల్లో ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 500 పాదయాత్రల కార్యాచరణ కొనసాగుతోందని తెలిపారు.