Abhishek Porel Century In Ranji Trophy 
క్రీడలు

36 రోజుల జైలు శిక్ష..కట్ చేస్తే సెంచరీ

లైంగిక దాడి ఆరోపణలో జైలుకు వెళ్లిన బెంగాలీ క్రికెటర్ అభిషేక్ పోరెల్ రీ-ఎంట్రీలో రఫాడించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 137 బంతుల్లోనే 114 పరుగులు చేశాడు.

Sai kiran

ప్రభాత ఉదయం, స్పోర్ట్స్ :  లైంగిక దాడి ఆరోపణలో జైలుకు వెళ్లిన బెంగాలీ క్రికెటర్ అభిషేక్ పోరెల్ రీ-ఎంట్రీలో రఫాడించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పోరెల్ సెంచరీతో ఇరగదీశాడు. ఈ తరుణంలోనే గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనపై వచ్చిన ఆరోపణలపై సెంచరీ చేసిన తర్వాత స్పందించాడు. కావాలనే తనను తప్పుడు కేసులో ఇరికించారని ఎమోషనల్ అయ్యాడు. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలనే బరిలోకి దిగినట్టు స్పష్టం చేశాడు. ఈ తరుణంలోనే సెంచరీ చేశాక కన్నీళ్లు ఆగలేదని ఎమోషనల్ అయ్యాడు.

పోరెల్‌కు 36 రోజుల జైలు శిక్ష

అభిషేక్ పోరెల్‌పై కర్ణాటకకు చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ పరిధిలోని మొగ్రా పోలీస్ స్టేషన్‌లో ఈ ఏడాది జూన్‌ 23న ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్న ఆమె, చంపేస్తానని బెదిరించాడని ఆరోపణలు చేసింది. ఈ తరుణంలోనే బీఎన్ఎస్, ఐటీ యాక్ట్ కింద పోరెల్‌పై కేసు నమోదైంది. అయితే, ఈ ఆరోపణలను నిరాధారమైనవని అతడు కొట్టిపారేశాడు. కానీ అప్పటికే పోరెల్‌పై నెగెటిగ్ ప్రచారం లోకాన్ని చుట్టేసింది. స్థానిక చిన్సురా కోర్టు బెయిల్ రిజెక్ట్ చేయడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 36 రోజుల పాటు జైలులో ఉన్న ఇటీవలే బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు.

తర్వాత బెంగాల్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ బరిలోకి దిగాడు. పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణి (Kalyani) పట్టణంలో అక్టోబర్ 11న ఢిల్లీతో ప్రారంభమైన రంజీ మ్యాచ్ రెండో రోజు ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పోరెల్ 137 బంతుల్లోనే 114 పరుగులు చేసి దుమ్ములేపాడు. సెంచరీ చేసిన అనంతరం మైదానంలోనే మోకాళ్లపై కూర్చోని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సంఘటన ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సెంచరీపై క్రీడా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అభిషేక్ పోరెల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.