Bhuvneshwar Kumar comeback to Team India 
క్రీడలు

కొంపముంచిన భువీ..ఆర్సీబీకి రూ.6.75 కోట్ల నష్టం

Sai kiran

• టీమిండియాలోకి భువీ రీ-ఎంట్రీ

• తలల పట్టుకుంటోన్న ఆర్సీబీ యాజమాన్యం

ప్రభాత ఉదయం, స్పోర్ట్స్: టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీకి రంగం సిద్ధమైంది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్ నేపథ్యంలో భువీ పునరాగమనం చేయబోతున్నాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుంటే, ఆర్సీబీ యాజమాన్యం మాత్రం తలలు పట్టుకుంటోంది. భువీ రీ-ఎంట్రీ, ఇస్తే ఆర్సీబీ రూ.6.75 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. బీసీసీఐ అమలు చేస్తోన్న క్యాప్డ్,  అన్‌క్యాప్డ్ రూల్ కారణంగా ఆర్సీబీకి ఆర్థికంగా నష్టం జరుగనుందని ప్రచారం జోరందుకుంది.

క్యాప్డ్, అన్ క్యాప్డ్ రూల్ ఏంటి ?

ఒక భారతీయ క్రికెటర్, అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఐదేళ్లు దాటితే, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా మారిపోతాడు. అప్పుడు అతని ఐపీఎల్ సాలరీ రూ.4 కోట్లు మాత్రమే. ధోని ఇలాగే చెన్నై నుంచి తీసుకుంటున్నాడు. రెగ్యులర్‌గా అంతర్జాతీయ క్రికెట్ ఆడే వాళ్లను క్యాప్డ్ ప్లేయర్లుగా ట్రీట్ చేస్తారు. ఇన్ని రోజులుగా భువీ క్యాప్డ్ ప్లేయర్‌గా ఉండి, ప్రతీ సీజన్‌కు రూ.10.75 కోట్లు ఆర్సీబీ నుంచి తీసుకున్నాడు. 2022లో భువీ, తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

అంటే ఈ లెక్కన 2027 వస్తే, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా మారిపోతాడన్న మాట. కానీ ఇంతలోనే న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్2కు భువీ ఎంపికయ్యాడు. దీంతో అతడు క్యాప్డ్ ప్లేయర్‌గా మారిపోయాడు. ఈ దెబ్బకు వచ్చే సీజన్ కోసం అన్‌క్యాప్డ్ ప్లేయర్ కింద రూ.4 కోట్లకే రిటైన్ చేసుకోవాలనే ఆర్సీబీ ప్లాన్ బెడిసికొట్టింది. ఇక వచ్చే సీజన్ కోసం కచ్చితంగా రూ.10.75 కోట్లు పెట్టి, అతడిని రిటైన్ చేసుకోవాల్సిందే. ఈ లెక్కన ఆర్సీబీకి రూ.6.75 కోట్ల నష్టం వాటిల్లనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.    

ఆర్సీబీకి భువీ వెన్నుముక

ఆర్సీబీ వరుసగా రెండుసార్లు టైటిల్ నెగ్గింది. దీనికి ముఖ్య కారణం భువనేశ్వర్ కుమారేనని గణంకాలు చెబుతున్నాయి. 2025, 2026 సీజన్లలో మొత్తం 45 వికెట్లు పడగొట్టి, జట్టు ఛాంపియన్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటోడి కోసం ఆర్సీబీ నష్టం భరిస్తుందని ప్రచారం సాగుతోంది.