Bhuvneshwar Kumar replaces Arshdeep Singh for the final T20I 
క్రీడలు

అర్ష్‌దీప్‌కు గాయం..బెంగళూరు టీ20కి భువీ

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ ప్రారంభానికి ముందే పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నాడు.

Sai kiran

ప్రభాత ఉదయం,  స్పోర్ట్స్:

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ ప్రారంభానికి ముందే పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ గాయపడటంతో అతడి స్థానంలో భువీకి అవకాశం దక్కింది. ఈ మేరకు శుక్రవారం బీసీసీఐ అధికారక ప్రకటన చేసింది. విండీస్ టీ20 సిరీస్ కోసం ముందుగా ఫైనల్ చేసిన జట్టులో అర్ష్‌దీప్‌ సింగ్ స్థానాన్ని భర్తీ చేసే మరో ఫాస్ట్ బౌలర్ అందుబాటులో లేకపోవడంతో భువీని బరిలోకి దింపాల్సిన అవసరం వచ్చింది.

వాస్తవానికి ఈ నెల 22 నుంచి న్యూజిలాండ్‌లో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ సందర్భంగా భువీ రీఎంట్రీ చేయాల్సి ఉంది. అయితే అర్ష్‌దీప్‌ గాయపడటంతో శనివారం బెంగళూరులో వెస్టిండీస్‌తో జరిగే ఐదో టీ20 మ్యాచ్ కోసం ముందుగానే భారత జట్టులోకి రావాల్సి వచ్చింది. దీంతో భువనేశ్వర్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2012లో బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన భువీ.. ఇప్పుడు అదే వేదికగా మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయడం విశేషం.

అర్ష్‌దీప్‌ సింగ్‌ భుజానికి గాయం

బుధవారం హైదరాబాద్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌ సందర్భంగా వెస్టిండీస్‌ బౌలర్‌ షమర్‌ జోసెఫ్‌ వేసిన బౌన్సర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ భుజానికి బలంగా తగిలింది. గాయం తీవ్రత దృష్ట్యా అతడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌ స్థానంలో భువనేశ్వర్‌ కుమార్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.