· ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి శర్మ
· మూడో స్థానానికి పడిపోయిన కిషన్
దుబాయ్: న్యూజిలాండ్‌పై 35 బంతుల్లో బంతుల్లో సెంచరీ బాదిన అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి చేరుకున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపడి, ఫస్ట్ ప్లేస్‌కు దూసుకెళ్లాడు. రెండు టీ20లకు దూరమైన ఇషాన్ కిషన్, మూడో స్థానానికి పడిపోయాడు. పాకిస్తాన్ టీ20 కెప్టెన్ ఫర్హాన్ రెండో స్థానం దక్కించుకున్నాడు. హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ వరుసగా 4, 5 స్థానాలకు చేరుకున్నారు. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ గడ్డపై విఫలమవుతున్నందున 5 స్థానాలు దిగజారి 9వ స్థానానికి దిగజారాడు.
రవీంద్ర జడేజాకు ఝలక్.. 4 ఏళ్ల తర్వాత
టెస్టు ఆల్ రౌండర్ల ర్యాకింగ్స్లో దక్షిణాఫ్రికా ప్లేయర్ యాన్సెన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. 4 ఏళ్ల 7 నెలల తర్వాత రవీంద్ర జడేజా ఫస్ట్ ర్యాంక్ కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. అటు వన్డేల్లో గిల్, టెస్టుల్లో బ్రూక్ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు.