• ఓపెనింగ్ స్థానం కోసం తీవ్ర పోటీ
• సంజును కాదని వైభవ్‌కు చాన్స్‌లు
• గంభీర్ తీరుపై విమర్శలు
ప్రభాత ఉదయం, స్పోర్ట్స్ : వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్‌కు 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ తలనొప్పిగా మారాడు. ఐపీఎల్ 2026లో మెరుగైన ప్రదర్శన చేసి టీమిండియాలోకి వచ్చిన వైభవ్, ఏకంగా సంజు ప్లేస్‌కే ఎసరు పెట్టాడు. టీ20ల్లో సంజును కాదని వైభవ్‌ను ఓపెనర్‌గా టీమిండియా మేనేజ్‌మెంట్ పంపిస్తోంది. దీంతో సంజుకు తుది జట్టులో స్థానం దక్కడం లేదు. ఒకవేళ అవకాశం వస్తే, ఫస్ట్ డౌన్‌లో పంపిస్తారు. ఓపెనర్‌గా దిగితేనే ఇరగదీసే సంజు, మిగతా స్థానాల్లో రాణించలేకపోతున్నాడు. దీంతో సంజు అంశం టీమిండియా యాజమాన్యానికి కూడా తలనొప్పిగా మారింది. స్ట్రైక్‌రేట్ మెరుగ్గా ఉన్న వైభవ్‌ను ఓపెనర్‌గా పంపాలా ? లేక వరల్డ్ కప్ తెచ్చిన సంజును బరిలోకి దించాలా ? అని తల పట్టుకుంటోంది.
వైభవ్ వర్సెస్ సంజు ఎవరు బెస్ట్ ?
వైభవ్ సూర్యవంశీ కంటే అనుభవం ఎక్కువగా ఉన్న సంజు వైపు క్రీడా విశ్లేషకులు, మాజీలు మొగ్గుచూపుతున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా సంజు కీలక ఇన్నింగ్స్‌లు ఆడి, టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు. నివేదికల ప్రకారం టీ20 క్రికెట్‌లో సంజుకు 11 ఏళ్ల అనుభవం ఉంది. 2015లోనే అరంగేట్రం చేశాడు. 73 మ్యాచ్‌లు ఆడిన అతను 3 సెంచరీలు, 1578 పరుగులు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌కు 5 ఏళ్ల పాటు కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉంది. ఒత్తిడి సమయాల్లో నిలదొక్కుకుని, టీమిండియాను చాలా సార్లు గెలిపించాడు. ఫ్లాట్ ట్రాక్స్‌పైనే కాకుండా విదేశీ పిచ్‌లపై సంజుకు మంచి రికార్డులు ఉన్నాయి.
గంభీర్ తీరుపై మాజీలు విమర్శలు
ఇక వైభవ్ విషయానికి వస్తే, ఇదే ఏడాది టీ20 అరంగేట్రం చేశాడు. కేవలం 8 మ్యాచ్‌లు ఆడిన అనుభవం మాత్రమే ఉంది. 300ల పరుగులు కూడా దాటలేదు. ఇంగ్లండ్ టీ20 సిరీస్, ఏషియన్ గేమ్స్‌లో అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఐపీఎల్ తప్ప, అంతర్జాతీయ క్రికెట్‌కు పనికిరాడని పలువురు మాజీలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏ లెక్కన చూసినా సంజుకు వైభవ్ సరిపోడని స్పష్టం చేస్తున్నారు. సంజును కావాలనే గంభీర్ పక్కకు పెడుతున్నారనే వాదన వినిపిస్తున్నారు. ప్రయోగాల పేరుతో సంజు కెరీర్ నాశనం చేస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు. కేవలం టీ20ల్లోనే ఆడుతోన్న సంజును ఓపెనర్‌గానే పంపాలని క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. వైభవ్‌ను ఆడించాలనుకుంటే, అతన్నే మిడిల్ లేదా తొలి వికెట్‌కు పంపాలని కోరుతున్నారు. మరి దీనిపై గంభీర్ అండ్ కో ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.