క్రీడలు

సన్‌రైజర్స్‌లోకి నటరాజన్ రీ-ఎంట్రీ

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ నటరాజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తిరిగి దక్కించుకున్నట్లు సమాచారం. ఈ ట్రేడ్‌లో జీషన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లనున్నాడు.

Sai kiran

ప్రభాత ఉదయం, స్పోర్ట్స్ డెస్క్ : సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి డేత్ ఓవర్ల స్పెషలిస్ట్ నటరాజన్ పునరాగమనం చేయబోతున్నాడు. ఐపీఎల్ 2027 నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య భారీ ట్రేడ్ జరిగింది. ఈ ట్రేడ్‌లో భాగంగా జీషన్ అన్సారీని ఢిల్లీకి ఇచ్చి, నటరాజన్‌ను తిరిగి తమ జట్టులోకి కావ్య మారన్ తీసుకున్నారు. ఈ మేరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

గతేడాది బౌలింగ్‌లో విఫలమైన సన్‌రైజర్స్‌, ఎలిమినేటర్ దశలోనే నిష్క్రమించింది. ఈ తరుణంలోనే మెరుగైన బౌలర్ కావాలన్న లక్ష్యంతో నటరాజన్‌ను మళ్లీ ట్రేడ్ చేసి దక్కించుకుంది. ఇక నటరాజన్‌ను తీసుకోవడంపై హైదరాబాద్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2020 నుంచి 2024 వరకు సన్‌రైజర్స్‌కే నటరాజన్ ప్రాతినిధ్యం వహించాడు. 2024లో 19 వికెట్లతో ఇరగదీసిన అతన్ని 2025 వేలంలో రూ.10.75 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకుంది. ఇప్పుడు రూ.5 కోట్లకు తిరిగి హైదరాబాద్ దక్కించుకుంది. అటు అన్సారీని రూ.40 లక్షలకు ఢిల్లీ తీసుకుంది.