Kapil dev comments on vaibhav 
క్రీడలు

వైభవ్‌కూ వినోద్ కాంబ్లీ గతే పడుతుంది

·       అతడిపై ఒత్తిడి పెట్టొద్దు : కపిల్ దేవ్ ·       3 ఏళ్ల సమయం ఇవ్వాల్సిందేనని సూచనలు

Sai kiran

ప్రభాత ఉదయం, స్పోర్ట్స్ :  కెరీర్‌ను లైట్ తీసుకుంటే వినోద్ కాంబ్లీకి పట్టిన గతే వైభవ్ సూర్యవంశీకి పడుతుందని వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్లలోనే కెరీర్ ప్రారంభమైన తరుణంలో గాయాల బారిన పడకుండా వైభవ్‌కు సూచించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి, కెరీర్ నాశనం చేసుకోవద్దని కోరారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా వైభవ్ కెరీర్‌పై కపిల్ దేవ్ స్పందించారు. వైభవ్ భయంకరమైన షాట్లు ఆడగలడని ప్రశంసించారు. మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సర్లు కొడతాడన్నారు. అతన్ని చూస్తే, ఫ్యూచర్ సచిన్ లాగా కనిపిస్తున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి ఆటగాడు టీమిండియాకు ఆడటం గొప్ప విషయమన్నారు.

వినోద్ కాంబ్లీ లాగా కెరీర్ నాశనం చేసుకోవద్దు

వినోద్ కాంబ్లీ లాగా వైభవ్ తన కెరీర్ నాశనం చేసుకోవద్దని కపిల్ దేవ్ సూచించారు. చిన్న వయస్సులోనే టీమిండియాలోకి వచ్చిన కాంబ్లీ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. కెరీర్‌పైన ఫోకస్ చేయకుండా అడ్డదారులు తొక్కాడని తెలిపారు. ప్రతిభ ఉన్నప్పటికీ వినియోగించుకోలేక ఇప్పుడు రోడ్డున పడ్డాడని గుర్తు చేశారు. ఆస్పత్రి బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడని, అతనికి ఓల్డేజ్ హోం దిక్కయిందన్నారు. అలాంటి పరిస్థితులు వైభవ్ తెచ్చుకోవద్దని కోరారు. ఐపీఎల్ ద్వారా డబ్బులు వస్తున్నాయని, జల్సాలు చేయకుండా కెరీర్ బిల్డప్ చేసుకోవాలని తెలిపారు. అప్పుడే విరాట్ కోహ్లీ, సచిన్‌ రేంజ్‌కు చేరతాడన్నారు.

మరో 3 ఏళ్లు టైం ఇవ్వండి

వైభవ్‌పై అతిగా ఒత్తిడి పెట్టొద్దని టీమిండియా యాజమాన్యాన్ని కపిల్ దేవ్ కోరారు. అతనికి కనీసం మూడేళ్ల సమయం ఇవ్వాలన్నారు. ఆ తర్వాత ఎలాంటి ఒత్తిడినైనా అతను ఫేస్ చేస్తాడని తెలిపారు. టీ20ల్లోనే కాకుండా టెస్టుల్లో వైభవ్‌కు అవకాశాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. టెస్టుల్లో వైభవ్ ఆడితే, వ్యూయర్‌షిప్ కూడా పెరుగుతుందన్నారు.