హైకమాండ్ మార్క్ సంస్కృతితో..ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత
1989 అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ప్రభుత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో 181 స్థానాల భారీ మెజారిటీని కట్టబెట్టారు. అయితే, లభించిన ఆ భారీ మెజారిటీని ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించడంలో కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. 1978 నుంచి 1983 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానైతే చెన్నారెడ్డి, టి. అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి రూపంలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చి ప్రజల ఆగ్రహానికి గురైందో, సరిగ్గా అదే చారిత్రక పొరపాటును 1989-1994 మధ్య కూడా పునరావృత్తం చేసింది. ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిల రూపంలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడం కాంగ్రెస్ పార్టీలోని తీవ్రమైన అంతర్గత అసమ్మతిని, అధికార దాహాన్ని బహిర్గతం చేసింది. ఒక ముఖ్యమంత్రి పీఠమెక్కగానే, ఆయనను పదవి నుంచి దించేందుకు సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గాలు కుట్రలు పన్నడం, ఢిల్లీ పెద్దల వద్ద పంచాయితీలు పెట్టడం నిత్యకృత్యంగా మారింది. నాయకుల దృష్టి మొత్తం పదవులను కాపాడుకోవడం, ప్రత్యర్థులను దెబ్బతీయడంపైనే కేంద్రీకృతం చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన విసుగు, వ్యతిరేకత పెల్లుబికాయి.
సారా నిషేధ ఉద్యమం.. మహిళల తిరుగుబాటు
1992 ప్రారంభంలో నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామంలో రోశమ్మ నాయకత్వంలో ప్రారంభమైన "సారా నిషేధ ఉద్యమం" క్రమక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా ఉద్యమంగా మారింది. మద్యం వల్ల కుటుంబ ఆదాయం నాశనం కావడం, భర్తల మద్యపానం కారణంగా గృహహింస పెరగడం, పిల్లల విద్యకు ఇబ్బందులు రావడం వంటి సమస్యలు మహిళలను ఉద్యమం వైపు నడిపించాయి. ఈ ఉద్యమం ఒక రాజకీయ పార్టీ సృష్టించినది కాకపోవడం దాని బలాన్ని మరింత పెంచింది. గ్రామీణ మహిళలు స్వయంగా సమస్యను రాజకీయ అంశంగా మార్చారు. మొదట్లో ప్రభుత్వం దీనిని స్థానిక సమస్యగా చూసినా, ఉద్యమం విస్తరించడంతో అది రాష్ట్రవ్యాప్త అంశంగా మారింది. కానీ అప్పటికే “మద్యం కుటుంబాలను నాశనం చేస్తోంది” అనే భావన మహిళల్లో బలంగా స్థిరపడింది. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి 1993, అక్టోబర్ 2 నుంచి సారాయిని నిషేధించారు. కానీ విదేశీ మద్యాన్ని సమర్థించడం మహిళా లోకంలో మరింత ఆగ్రహాన్ని పెంచింది. ఈ పరిణామం రాష్ట్రంలోని మహిళా ఓటర్లందరినీ కాంగ్రెస్‌కు పూర్తిగా దూరం చేసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో 1994 శాసనసభ ఎన్నికలు ఒక అసాధారణమైన, చారిత్రాత్మక మలుపుగా నిలిచిపోయాయి. 1989లో ఓటమిపాలై ప్రతిపక్షానికే పరిమితమైన తెలుగుదేశం పార్టీ 1994లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) నాయకత్వంలో సరికొత్త ఊపుతో, ఊహించని ప్రభంజనం సృష్టించింది. టీడీపీ సునామీలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వామపక్షాల పొత్తుతో ఉమ్మడి ఏపీలో ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని తేడా లేకుండా టీడీపీ మెజార్టీ సీట్లు సాదించింది. 294 స్థానాలున్న అసెంబ్లీలో టీడీపీ సొంతంగా 216 సీట్లు సాధించింది. టీడీపీ-వామపక్షాల కూటమి 250 సీట్లు గెలుచుకుంది. అంటేనే ఎంతటి ప్రభంజనమో అర్ధం చేసుకోవచ్చు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా పొందే అర్హతను కోల్పోయి కేవలం 26 స్థానాలకే పరిమితమై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.
మూడోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా
ఎన్టీ రామారావు మూడోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1994 డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. 1994 డిసెంబర్ 12న అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ ప్రభుత్వం సంపూర్ణ మద్యనిషేధం అమలుకు చర్యలు ప్రారంభించింది. డిసెంబర్ 29న మద్యనిషేధ ఆర్డినెన్స్‌ను జారీ చేసి, 1995 జనవరి 16 నుంచి దాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది. అనంతరం ఈ విధానానికి చట్టబద్ధ రూపం కల్పిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ యాక్ట్, 1995’ను ఫిబ్రవరి 20న రూపొందించారు.
హైకమాండ్ మార్క్ సంస్కృతితో..ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత
1989 అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ప్రభుత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో 181 స్థానాల భారీ మెజారిటీని కట్టబెట్టారు. అయితే, లభించిన ఆ భారీ మెజారిటీని ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించడంలో కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. 1978 నుంచి 1983 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానైతే చెన్నారెడ్డి, టి. అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి రూపంలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చి ప్రజల ఆగ్రహానికి గురైందో, సరిగ్గా అదే చారిత్రక పొరపాటును 1989-1994 మధ్య కూడా పునరావృత్తం చేసింది. ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిల రూపంలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడం కాంగ్రెస్ పార్టీలోని తీవ్రమైన అంతర్గత అసమ్మతిని, అధికార దాహాన్ని బహిర్గతం చేసింది. ఒక ముఖ్యమంత్రి పీఠమెక్కగానే, ఆయనను పదవి నుంచి దించేందుకు సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గాలు కుట్రలు పన్నడం, ఢిల్లీ పెద్దల వద్ద పంచాయితీలు పెట్టడం నిత్యకృత్యంగా మారింది. నాయకుల దృష్టి మొత్తం పదవులను కాపాడుకోవడం, ప్రత్యర్థులను దెబ్బతీయడంపైనే కేంద్రీకృతం చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన విసుగు, వ్యతిరేకత పెల్లుబికాయి.
సారా నిషేధ ఉద్యమం.. మహిళల తిరుగుబాటు
1992 ప్రారంభంలో నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామంలో రోశమ్మ నాయకత్వంలో ప్రారంభమైన "సారా నిషేధ ఉద్యమం" క్రమక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా ఉద్యమంగా మారింది. మద్యం వల్ల కుటుంబ ఆదాయం నాశనం కావడం, భర్తల మద్యపానం కారణంగా గృహహింస పెరగడం, పిల్లల విద్యకు ఇబ్బందులు రావడం వంటి సమస్యలు మహిళలను ఉద్యమం వైపు నడిపించాయి. ఈ ఉద్యమం ఒక రాజకీయ పార్టీ సృష్టించినది కాకపోవడం దాని బలాన్ని మరింత పెంచింది. గ్రామీణ మహిళలు స్వయంగా సమస్యను రాజకీయ అంశంగా మార్చారు. మొదట్లో ప్రభుత్వం దీనిని స్థానిక సమస్యగా చూసినా, ఉద్యమం విస్తరించడంతో అది రాష్ట్రవ్యాప్త అంశంగా మారింది. కానీ అప్పటికే “మద్యం కుటుంబాలను నాశనం చేస్తోంది” అనే భావన మహిళల్లో బలంగా స్థిరపడింది. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి 1993, అక్టోబర్ 2 నుంచి సారాయిని నిషేధించారు. కానీ విదేశీ మద్యాన్ని సమర్థించడం మహిళా లోకంలో మరింత ఆగ్రహాన్ని పెంచింది. ఈ పరిణామం రాష్ట్రంలోని మహిళా ఓటర్లందరినీ కాంగ్రెస్‌కు పూర్తిగా దూరం చేసింది.
ముందస్తు వ్యూహం లేకపోవడం
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని అంచనా వేయడంలో ఆ పార్టీ నాయకత్వం తీవ్రంగా విఫలమైంది. సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల కంటే తమ సొంత పదవులు, టిక్కెట్ల కేటాయింపులపైనే నాయకులు దృష్టి పెట్టారు. కాంగ్రెస్ అంతర్గత విభేదాల కారణంగా అసంతృప్తి చెందిన చాలామంది సీనియర్ నాయకులు, అసెంబ్లీ ఎన్నికల నాటికి తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగడం లేదా టీడీపీలో చేరడం కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బతీసింది.
చైతన్య రథం.. మళ్లీ రోడ్డెక్కిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో చైతన్య రథం ఒక ప్రచార వాహనం మాత్రమే కాదు.. ఒక రాజకీయ చిహ్నం. 1983లో అదే రథం ఎన్టీఆర్‌ను గ్రామ గ్రామానికీ తీసుకెళ్లింది. 1994లో మరోసారి అదే రాజకీయ ప్రయోగాన్ని పునరావృతం చేశారు. 'చైతన్య రథం'పై రాష్ట్రవ్యాప్తంగా సాగించిన తుఫాను పర్యటనలు ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయి. ఎన్టీఆర్‌ను ప్రజలు కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, తమ కష్టాలను తీర్చే ఒక రక్షకుడిగా, దేవుడిగా భావించారు. ఆయన ప్రసంగాలు, కాంగ్రెస్ అవినీతిపై ఆయన చేసిన సింహగర్జనలు, ఉపన్యాస శైలి లక్షలాది మంది ప్రజలను ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ నాటి ఎన్నికల్లో టీడీపీకి అతిపెద్ద అస్త్రంగా మారింది. 1989లో ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ రాజకీయంగా ముగిసిపోయారని కొందరు భావించారు. ముఖ్యంగా కల్వకుర్తిలో ఆయన ఓటమి ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు పెద్ద దెబ్బ. 1994లో ఆయన ప్రజల్లోకి వెళ్లినప్పుడు ‘నేను ఓడిపోయాను’ అనే రక్షణాత్మక భాషకు బదులుగా ‘కాంగ్రెస్ విఫలమైంది’ అనే దాడి రాజకీయాన్ని ఎంచుకున్నారు.
బలమైన హామీలే అస్త్రాలుగా
ఎన్టీఆర్ రూ.2 కే కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం వంటి రెండు బలమైన హామీలతో ప్రజల ముందుకు వెళ్లి అఖండ విజయం సాధించారు. రాష్ట్రంలో రగిలిన మద్యపాన వ్యతిరేక మహిళా ఉద్యమాన్ని ఎన్టీఆర్ తక్షణమే గుర్తించి, దానికి పూర్తి మద్దతు ప్రకటించారు. "తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం సంపూర్ణ మద్యపాన నిషేధంపైనే పెడతాను" అని ఆయన వేదికలపై ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఛార్జీల పెంపు, విద్యుత్ కొరత, బిల్లుల వసూళ్లలో వేధింపులతో రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉండేది. వ్యవసాయ బావులకు ఉపయోగించే పంపుసెట్లకు కరెంట్ మీటర్ల గోల లేకుండా, ప్రతి హార్స్ పవర్ (HP) కు నెలకు కేవలం రూ. 50 ల ఫ్లాట్ రేట్ కే విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. ఈ ఒక్క ప్రకటనతో రాష్ట్రంలో పంపుసెట్లపై ఆధారపడి వ్యవసాయం చేసే కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతులు ఏకతాటిపైకి వచ్చి టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. జనతా వస్త్రాలు, పక్కా గృహనిర్మాణ' పథకాలు కూడా అత్యంత బలమైన సంక్షేమ అస్త్రాలుగా నిలిచాయి.
లక్ష్మీపార్వతి ప్రచారం.. మహిళా ఓటరుతో కొత్త అనుసంధానం
1993లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. 1994 ఎన్నికల ప్రచారంలో ఆమె ఎన్టీఆర్‌తో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఎన్టీఆర్ ప్రసంగం తర్వాత ఆమె మాట్లాడటం, ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని ప్రజలకు పరిచయం చేయడం, ముఖ్యంగా మహిళలతో అనుసంధానం కల్పించడం ప్రచారంలో కనిపించింది. మద్యనిషేధం వంటి మహిళలకు సంబంధించిన ప్రధాన హామీ నేపథ్యంలో ఆమె ప్రచారంలో కనిపించడం టీడీపీకి ఒక ప్రత్యేక దృశ్యరూపాన్ని ఇచ్చింది. అయితే ఇదే అంశం తర్వాత టీడీపీలో అంతర్గత కుటుంబ, నాయకత్వ రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది. కానీ 1994 ఎన్నికల సమయంలో మాత్రం ఆమె ఉనికి ప్రచారానికి ఉపయోగపడిన అంశంగా కనిపించింది.
పీవీ నరసింహారావు వర్సెస్ ఎన్టీఆర్
1994 ఎన్నికల నాటికి పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆయన సొంత రాష్ట్రం కావడంతో కాంగ్రెస్ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. పీవీ ప్రచారంలో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి గురించి మాట్లాడేవారు. కానీ ఎన్టీఆర్ ప్రచారం పూర్తిగా దీనికి భిన్నంగా ఉండేది. ఎన్టీఆర్ పేదరికం, ధరలు, మద్యం, బియ్యం వంటి నిత్యజీవిత సమస్యలపై మాట్లాడారు. ప్రజల ఇంటి సమస్యలకు తక్షణ పరిష్కారాల వాగ్దానం చేసిన ఎన్టీఆర్ ప్రచారం విస్తృతంగా స్పందన పొందింది.
లాభించిన లెఫ్ట్‌తో పొత్తు
1994లో టీడీపీ ఎన్నికల వ్యూహంలో మరో ముఖ్యమైన అంశం వామపక్ష పార్టీలతో పొత్తు. టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం పోటీ చేశాయి. ఫలితాల్లో సీపీఐ 19, సీపీఎం 15 స్థానాలు గెలుచుకున్నాయి. అంటే టీడీపీ ఒంటరిగా మాత్రమే కాకుండా విస్తృతమైన ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించింది. ఈ కలయిక కాంగ్రెస్‌కు వ్యతిరేక ఓట్ల విభజనను తగ్గించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వామపక్ష పార్టీలకు ఉన్న సంస్థాగత బలం టీడీపీకి తోడైంది. మొత్తం టీడీపీ–సీపీఐ–సీపీఎం కలిపి 250 స్థానాలు గెలిచాయి.
మహిళలు.. టీడీపీ సునామీకి ‘సైలెంట్ ఫోర్స్’
1994 ఎన్నికలలో మహిళల పాత్రను ప్రత్యేకంగా చూడాలి. మద్యనిషేధ ఉద్యమం గ్రామీణ మహిళలను రాజకీయంగా చైతన్యపరిచింది. ‘మా ఇంటి డబ్బు మద్యంలో పోకూడదు’ అనే కుటుంబ ఆర్థిక సమస్య.. ‘మా భర్త మద్యం తాగి హింసించకూడదు’ అనే సామాజిక సమస్య.. ‘మా పిల్లలు చదవాలి’ అనే భవిష్యత్ ఆకాంక్ష.. ఇవన్నీ ఒకే రాజకీయ డిమాండ్‌లో కలిశాయి. సంపూర్ణ మద్యనిషేధం హామీ ఇవ్వడం ద్వారా ఎన్టీఆర్ ఈ ఆందోళనకు రాజకీయ ప్రతినిధిగా నిలిచారు. అందుకే 1994 ఎన్నికలను మహిళల రాజకీయ చైతన్యానికి కూడా ఒక మైలురాయిగా చూడవచ్చు.
కాంగ్రెస్ సారా నిషేధం చేసినా..ఎందుకు టీడీపీకి లాభించింది?
ఇది 1994 ఎన్నికలలో ఒక రాజకీయ వ్యంగ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అరక్కుపై నిషేధం విధించింది. అయినప్పటికీ మహిళల అసంతృప్తి పూర్తిగా తగ్గలేదు. కారణం.. ఉద్యమం కేవలం అరక్కు నిషేధం కోసం మాత్రమే కాకుండా కుటుంబాలను మద్యం సమస్య నుంచి పూర్తిగా బయటపడేయాలన్న స్థాయికి వెళ్లింది. టీడీపీ ఈ అసంతృప్తిని ‘సంపూర్ణ మద్యనిషేధం’గా నిర్వచించింది. అంటే కాంగ్రెస్ తీసుకున్న చర్యను కూడా టీడీపీ తన రాజకీయ హామీకి ఆధారంగా మార్చుకుంది. కాంగ్రెస్ ‘మేమే నిషేధం విధించాం’ అని చెప్పగా.. టీడీపీ ‘పూర్తి నిషేధం మేమే అమలు చేస్తాం’ అని చెప్పింది. ఎన్నికల్లో రెండో సందేశమే ఎక్కువగా ప్రభావం చూపింది.
1983తో పోలిస్తే 1994 విజయం ఎలా భిన్నం?
1983లో ఎన్టీఆర్ విజయం ఒక కొత్త రాజకీయ వ్యవస్థ పుట్టుకకు సంకేతం. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని తొలిసారి ఒక ప్రాంతీయ పార్టీ బలంగా సవాలు చేసింది. కానీ 1994లో పరిస్థితి వేరుగా ఉంది. టీడీపీ అప్పటికే 12 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ. అధికారంలో ఉంది, ఓడిపోయింది, మళ్లీ ప్రతిపక్షంలోకి వెళ్లింది. అంటే 1994 విజయం ‘కొత్త పార్టీ విజయం’ కాదు.. ఓడిపోయిన ప్రాంతీయ పార్టీ పునరాగమనం. 1983లో ప్రజలు ఎన్టీఆర్‌ను ప్రయోగంగా ఎన్నుకున్నారని చెప్పవచ్చు. 1994లో మాత్రం ఆయనకు పాలనా అనుభవం ఉన్న నాయకుడిగా మరో అవకాశం ఇచ్చారు. అందుకే 1994 విజయానికి రాజకీయ బరువు మరింత ఎక్కువ.
టీడీపీకి లభించిన 44 శాతం ఓట్లు.. కానీ 73 శాతం సీట్లు
294 స్థానాల్లో 216 సీట్లు అంటే టీడీపీకి దాదాపు 73.5 శాతం అసెంబ్లీ సీట్లు లభించాయి. కానీ ఓట్లు 44.14 శాతం మాత్రమే. ఇది ఎన్నికల వ్యవస్థలో ‘సీట్ల మార్పిడి ప్రభావం’కు క్లాసిక్ ఉదాహరణ. ఒక పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా సమానంగా ఓట్లు రావడం కంటే.. ఎక్కువ నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలవడం ముఖ్యం. 1994లో టీడీపీ ఇదే చేసింది. కాంగ్రెస్‌కు 33.85 శాతం ఓట్లు ఉన్నప్పటికీ కేవలం 26 స్థానాలు రావడం.. ఓట్ల భౌగోళిక పంపిణీ ఎంత ముఖ్యమో చూపిస్తుంది.
ఎన్టీఆర్ వర్సెస్ కాంగ్రెస్’గా మారిన ఎన్నిక
చాలా ఎన్నికల్లో అభ్యర్థులు, స్థానిక నాయకులు, కుల సమీకరణాలు కీలకం. 1994లో మాత్రం అనేక నియోజకవర్గాల్లో పోటీ ‘ఎన్టీఆర్ వర్సెస్ కాంగ్రెస్’గా వ్యక్తీకరించబడింది. ఇది టీడీపీకి భారీ ప్రయోజనం. అభ్యర్థి బలహీనంగా ఉన్న చోట కూడా ఎన్టీఆర్ వ్యక్తిగత ఇమేజ్ ఓటును తీసుకురాగలిగింది. కాంగ్రెస్ అభ్యర్థికి మాత్రం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా వ్యక్తిగత అభ్యర్థుల బలం కంటే పార్టీ నాయకత్వంపై ప్రజల తీర్పు ప్రభావం ఎక్కువైంది.
టీడీపీ గెలుపు వెనుక కారణాలను ఒకే వాక్యంలో చెప్పాలంటే
టీడీపీ గెలిచింది ఎందుకంటే.. ఎన్టీఆర్ ప్రజల్లోకి తిరిగి వెళ్లారు; చైతన్య రథంతో రాష్ట్రాన్ని చుట్టేశారు; కాంగ్రెస్ పాలనపై ఉన్న అసంతృప్తిని ఒకే రాజకీయ కథనంగా మలిచారు; సంపూర్ణ మద్యనిషేధం ద్వారా మహిళలను ఆకర్షించారు; రెండు రూపాయల బియ్యం, పేదల సంక్షేమం, సబ్సిడీ విద్యుత్ వంటి హామీలతో పేదలు, రైతులకు చేరువయ్యారు; వామపక్షాలతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకున్నారు; ముఖ్యంగా ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రజాదరణను పార్టీ యంత్రాంగంతో సమన్వయం చేశారు.
ఎన్టీఆర్ జీవితంలో చివరి మహా విజయం
1994లో టీడీపీ సాధించిన మహా విజయం ఎన్టీఆర్ జీవితంలో చివరి విజయంగా నిలిచింది. తర్వాతి కాలంలో ఆయన ఆరోగ్యం, కుటుంబ రాజకీయాలు, లక్ష్మీపార్వతి పాత్ర, పార్టీ అంతర్గత విభేదాలు, చివరకు 1995లో టీడీపీ నాయకత్వ మార్పు జరిగి 1995, సెప్టెంబర్ 1న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 1996, జనవరి 18న ఎన్టీఆర్ మరణించారు. అందువల్ల 1994 ఎన్నికల విజయాన్ని ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోని చివరి గొప్ప ప్రజా తీర్పుగా చూడవచ్చు.