Asifabad SP Nitika Pant urged the youth to stay away from drugs in a volleyball tournament held in Jainoor 
తెలంగాణ

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి : ఆసిఫాబాద్‌ ఎస్పీ నితికా పంత్‌

డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని ఆసిఫాబాద్‌ ఎస్పీ నితికా పంత్‌ సూచించారు. మత్తు పదార్థాలపై అవగాహన కోసం జైనూర్‌ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్‌ డివిజన్‌ స్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు.

Sai kiran

ప్రభాత ఉదయం, ఆసిఫాబాద్:  డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని ఆసిఫాబాద్‌ ఎస్పీ నితికా పంత్‌ సూచించారు. మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకు జైనూర్‌ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్‌ డివిజన్‌ స్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. యువతలో సానుకూల ఆలోచనలు, క్రమశిక్షణ పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని ఎస్పీ పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. టోర్నీలో పాల్గొన్న 65 జట్ల క్రీడాకారులు తమ గ్రామాల్లో డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్‌ డీఎస్పీ అశోక్‌, జైనూర్‌ సీఐ రమేశ్‌, వాంకిడి సీఐ వేణుగోపాల్‌, ఎస్సైలు రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.