బజార్‌హత్నూర్ ఎస్‌ఐ గోకుల రమేశ్  
తెలంగాణ

కేసు నుంచి తప్పించేందుకు లంచం.. ఏసీబీకి చిక్కిన బజార్‌హత్నూర్‌ ఎస్‌ఐ

బజార్‌హత్నూర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ గోకుల రమేశ్ రూ.40 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Phaneendra

ప్రభాత ఉదయం, బోథ్​ : కేసు నుంచి తప్పించేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్సై పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన ప్రకారం ఇటీవల బజార్‌హత్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఆత్మహత్య చేసుకున్న కేసు నమోదైంది. ఆ కేసులో ఫిర్యాదుదారుడిని ఇరికించకుండా ఉండటంతో పాటు, పోలీసుల వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు ఎస్‌ఐ గోకుల రమేశ్‌ రూ.40 వేల లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో రూ.40 వేలను బాధితుడి నుంచి తీసుకుంటుండగా బుధవారం ఆదిలాబాద్‌ రేంజ్‌ ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్​ఐని పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న  మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ డీఎస్పీ మధు పేర్కొన్నారు. ఎస్‌ఐని అరెస్టు చేశామని, కరీంనగర్‌ ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.