Collector Lakshmi Kiran directed officials to commence cotton procurement in the district after Dussehra 
తెలంగాణ

పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలి

దసరా తర్వాత జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. 23 సీసీఐ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Satya

ప్రభాత ఉదయం, సిద్దిపేట: దసరా పండుగ తరువాత జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని తొమ్మిది వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోని 23 సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాటు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.