Tirumalagiri Market yard 
తెలంగాణ

మద్దతు ధర కంటే అధికం

Madhu

- క్వింటాల్ వరి ధాన్యానికి రూ.3,710

- కందులకు రూ.9,870 వచ్చినట్లు వెల్లడి

ప్రభాత ఉదయం, తిరుమలగిరి: తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే అధికంగా వస్తున్నది. శుక్రవారం మార్కెట్‌కు 12,971 బస్తాల ధాన్యం తరలివచ్చినట్లు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎల్సోజు చామంతి నరేశ్ తెలిపారు. కత్తెర ధాన్యం క్వింటాకు రూ.3,710, దొడ్డు ధాన్యానికి రూ.2,961 ధర పలికిందని ఆమె వెల్లడించారు. కందులు క్వింటాకు రూ.9,870 మద్దతు ధర పలికిందని చామంతి వివరించారు. దళారులకు విక్రయించకుండా నేరుగా మార్కెట్‌కు తరలించి అధిక మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు. ఆమె వెంట మార్కెట్ కార్యదర్శి షంషీర్, సిబ్బంది, రైతులు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నరేశ్, డైరెక్టర్లు రాపాక సోమేశ్, దొడ్డ రమేశ్ తదితరులు ఉన్నారు.