ప్రభాత ఉదయం, ఉప్పల్: ఉప్పల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు ఐదు అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.67.75 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషితో నాబార్డ్ పథకం కింద ఈ నిధులు కేటాయించారు.
మంజూరైన నిధులతో ఐదు అదనపు తరగతి గదులను నిర్మించనున్నారు. దీంతో పాఠశాలలో తరగతి గదుల కొరత తగ్గడంతో పాటు విద్యార్థులకు మెరుగైన బోధనా వాతావరణం అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నిధుల మంజూరుకు సహకరించిన ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.