BRS Ex-MLA Kranthi Kiran 
తెలంగాణ

రైతులపై కాంగ్రెస్ సర్కారు వివక్ష : ఆందోల్‌ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులపై వివక్ష చూపుతోందని ఆందోల్‌ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Madhu

ప్రభాత ఉదయం, ఆందోల్: కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులపై వివక్ష చూపుతోందని ఆందోల్‌ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ ఆరోపించారు. అప్రకటిత విద్యుత్‌ కోతలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలోని అన్నాసాగర్‌ సబ్‌స్టేషన్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి కిరణ్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ కోతల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కోతలు లేకుండా రైతులకు రోజుకు 12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జైపాల్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డీవీ నాగభూషణం, మాజీ ఎంపీపీ బాలయ్య, లింగాగౌడ్‌, కాంత్‌రెడ్డి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.