గోదావరిఖని యువకులకు స్వాగతం పలుకుతున్న బీఆర్‌ఎస్ నాయకులు 
తెలంగాణ

కేసీఆర్‌ను కలిసేందుకు సైకిల్ యాత్ర

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు గోదావరిఖని యువకుల సైకిల్ యాత్ర.. మేడిగడ్డ నుంచి బయలుదేరిన 15 మంది గజ్వేల్‌కు చేరుకున్నారు.

Phaneendra

ప్రభాత ఉదయం, గజ్వేల్ : గోదావరిఖనికి చెందిన 15 మంది యువకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిసేందుకు సైకిల్​ యాత్ర చేపట్టారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమైన యాత్ర మంగళవారం గజ్వేల్​కు చేరుకుంది. గజ్వేల్​ బీఆర్​ఎస్​ ఇన్​ఛార్జ్​ వంటేరు ప్రతాప్​ రెడ్డి, మున్సిపల్ చైర్​పర్సన్​ గంగిశెట్టి చందన రవి, వైస్ చైర్ పర్సన్ పద్మాభాయి నర్సింగ్, మండల పార్టీ అధ్యక్షుడు నవాజ్ మీరా, కౌన్సిలర్లు తదితరులు యువకులకు స్వాగతం పలికారు. గోదావరిఖనికి చెందిన మాజీ కౌన్సిలర్ బొడ్డు రవీందర్​తో పాటు ఉప్పు రాజ్​కుమార్​, లక్ష్మణ్ గౌడ్, కె.బాబు, సర్వేశ్, అనిల్ కుమార్, నవీన్, శ్రీను, రాకేష్ తదితరులు సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్లిలోని ఫామ్​హౌస్​కు చేరుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలవనున్నారు.  ఈ సందర్భంగా తమ యాత్ర అనుభావాలను ఆయనతో పంచుకోనున్నారు. కేసీఆర్​ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలంగా పరిపాలన అందించారని యువకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు అభిప్రాయపడ్డారు.