Shiv Pratap Shukla and Minister Vivek Attends Nasha Mukt Bharat Abhiyaan Program In Medak 
తెలంగాణ

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం

Sai kiran
  • మెదక్‌లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

  • డ్రగ్స్‌ను తరిమికొట్టాలని గవర్నర్ శివ ప్రతాప్ పిలుపు

ప్రభాత ఉదయం, మెదక్ ప్రతినిధి:   2029 నాటికి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లాగా తెలంగాణలోనూ ప్రజల్లో చైతన్యం రావాలని, దీనికి మీడియా సహకరించాలని కోరారు. మంగళవారం మెదక్‌ ఐడీవోసీలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొని, ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు లేని దేశంగా మార్చాలనే సంకల్పంతో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర సర్కార్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమ ప్రచారాన్ని తెలంగాణ పోలీసులు చాలెంజ్‌గా తీసుకుని ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు.

ప్రతి విద్యార్థితో ప్రతిజ్ఞ చేయించాలి

ప్రతి నెల ఓ పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను తెలియచేయాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దిశా నిర్దేశం చేశారు. 15 వేల మంది విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జూన్‌లో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో ప్రతిజ్ఞ చేయించామని,  ప్రతి పాఠశాలలో విద్యార్థులచే ఇలాగే చేయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యమ్రంలో మంత్రి  గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ మాధవనేని రఘునందన్‌ రావు, ఎమ్మెల్యే రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాస రావు, అదనపు కలెక్టర్ నగేశ్, మెదక్ ఆర్టీవో రమాదేవి పాల్గొన్నారు.