Gram sabha in Mahabubpet passed a unanimous resolution imposing ban on Liquor sale 
తెలంగాణ

మద్యం అమ్మితే రూ.20 వేల జరిమానా

యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ గ్రామసభలో తీర్మానం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.20 వేల జరిమానా విధిస్తామని సర్పంచ్‌ ఆరె రమేష్‌ హెచ్చరించారు.

Sai kiran

ప్రభాత ఉదయం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.20 వేల జరిమానా విధిస్తామని సర్పంచ్‌ ఆరె రమేష్‌ హెచ్చరించారు. సోమవారం ఆయన అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్యానికి బానిసై కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, గ్రామంలో మద్యం విక్రయాలు పెరిగాయని మహిళలు, యువకులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు సర్పంచ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.