సినిమా ప్రమోషన్‌ కోసం సెలవు ప్రకటించడంపై మల్లారెడ్డి డీమ్డ్ వర్సిటీకి నోటీసులు జారీ చేసిన ఉన్నత విద్యామండలి 
తెలంగాణ

సినిమా ప్రమోషన్లకోసం సెలవులా?మల్లారెడ్డి వర్సిటీకి నోటీసులు

సినిమా ప్రమోషన్‌ కోసం యూనివర్సిటీకి సెలవు ప్రకటించడంపై మల్లారెడ్డి డీమ్డ్ వర్సిటీకి ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేసింది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ సిటీ : మల్లారెడ్డి డీమ్డ్ వర్సిటీకి ఉన్నత విద్యామండలి శుక్రవారం నోటీసులు ఇచ్చింది. కమర్షియల్ సినిమా ప్రమోషన్ కోసం వర్సిటీ కలేజీలకు సెలవు ప్రకటించడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దర్శకుడు త్రివిక్రమ్, హీరో వెంకటేశ్ నటించిన ఆదర్శ కుటుంబం సినిమా ప్రమోషన్ కోసం అక్టోబరు 30న వర్సిటీకి సెలవు ప్రకటించడంపై విద్యామండలి సీరియస్ అయ్యింది. కమర్షియల్ సినిమా ప్రమోషన్ కోసం అకడమిక్ తరగతుల వాయిదా వేయడాన్ని తప్పుబట్టింది. గతంలో హీరో యష్ నటించిన టాక్సిక్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో లైట్లు ఊడిపడి పలువురు విద్యార్థులు గాయపడ్డారు. అయినప్పటికీ.. మళ్లీ సినిమా కార్యక్రమాలు నిర్వహించడం, సెలవు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని వర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించింది.